Home Latest News Wipro | ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో.. హాఫ్ శాలరీకే పనిచేయాలని ఆదేశాలు

Wipro | ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో.. హాఫ్ శాలరీకే పనిచేయాలని ఆదేశాలు

Wipro | కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. ఒక కంపెనీని చూసి మరో కంపెనీ తమ ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చి ఇంటికి సాగనంపేస్తున్నాయి. గూగుల్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను తొలగించగా.. తాజాగా విప్రో షాకిచ్చింది. కొత్తగా చేరిన ఉద్యోగులకు మొత్తం జీతం ఇచ్చే పరిస్థితి లేదని.. అందులో సగం మాత్రమే ఇస్తామని బాంబు పేల్చింది.

సగం జీతం మాత్రమే ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నామని విప్రో తన ఉద్యోగులకు ఇదివరకే మెయిల్ పంపించింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా.. రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదని, వచ్చిన ప్రాజెక్టులు చేయడానికి ఆలస్యమవుతుందని అందుకే ఇలా సగం జీతం మాత్రమే ఇవ్వగలమంటూ వివరించింది. 2022-23 లో ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసుకున్న జూనియర్లను సగం జీతంతో ప్రాజెక్టులను అంగీకరించాలని కోరింది. ముందుగా చెప్పిన సంవత్సర ప్యాకేజీని 6.5 లక్షల వేతనాన్ని..3.5 లక్షలకు తగ్గించుకొని విధుల్లో చేరాలని మెయిల్స్ లో విప్రో పేర్కొంది. ఈ నెల 16నే ఉద్యోగులకు మెయిల్ చేసిన విప్రో తమ సమాధానాన్ని ఫిబ్రవరి 20లోపు చెప్పాలని కోరింది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

గతేడాది నుంచి ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారికి ఈ ఏడాది మార్చి నుంచి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. అందుకే విప్రో ఈ ప్రక్రియను వారి ముందుకు తీసుకుని వచ్చింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. మా వ్యాపారం అవవసరాలకు అనుగుణంగా మేము సర్దుబాట్లు చేసుకున్నాం. మేము ఇచ్చిన ఆఫర్‌ నచ్చిన వారు వెంటనే ఉద్యోగాల్లో చేరి వారి కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఇచ్చిన ఆఫర్ ను అభ్యర్థులు ఒప్పుకుంటే .. ఇంతకు ముందు ఇచ్చిన ఆఫర్ రద్దు అవుతుందని పేర్కొంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

EPFO | ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. అధిక పింఛను కావాలంటే ఇలా అప్లై చేసుకోవాలి!

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Exit mobile version