Home Entertainment Taraka Ratna | తారకరత్న ఎఫెక్ట్.. నందమూరి హీరోల సినిమాలు వాయిదా..!

Taraka Ratna | తారకరత్న ఎఫెక్ట్.. నందమూరి హీరోల సినిమాలు వాయిదా..!

Taraka Ratna | తారకరత్న మరణం నందమూరి కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ తీవ్ర విషాదం నింపింది. దాన్నుంచి కోలుకోవడం అనేది ఇప్పట్లో జరగని పని. ఎందుకంటే 40 ఏళ్లు కూడా నిండకుండానే ఈయన మరణం అందర్నీ కలిచి వేస్తుంది. ముఖ్యంగా పుట్టిన రోజుకు నాలుగు రోజు ముందు చనిపోయాడు ఈయన. ఫిబ్రవరి 22న తారకరత్న జయంతి. దానికి నాలుగు రోజుల ముందే మరణించడంతో కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈయన మరణం కారణంగా నందమూరి సినిమాలపై ప్రభావం గట్టిగా పడబోతుంది. ఇప్పటికే బాలయ్య సినిమా షూటింగ్ 20 రోజుల పాటు వాయిదా పడింది. ఇదింకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందిప్పుడు. ఫిబ్రవరి 5నే మొదలు కావాల్సిన అనిల్ రావిపూడి, బాలయ్య సినిమా షెడ్యూల్ 23కి వాయిదా పడింది. అయితే అబ్బాయి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న బాలయ్య.. ఈ డేట్ మరోసారి వాయిదా వేసేలా కనిపిస్తున్నాడు.

మార్చ్ మొదటి వారంలోనే అనిల్ రావిపూడ సినిమా మళ్లీ పట్టాలెక్కనుంది. అప్పటి వరకు కుటుంబంతోనే అండగా నిలబడబోతున్నాడు బాలయ్య. మరోవైపు ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ కూడా వాయిదా పడింది. ఎప్పట్నుంచో అనుకుంటున్న తారక్ 30 ఓపెనింగ్ ఫిబ్రవరి 24న కన్ఫర్మ్ చేసారు. అయితే అన్న తారకరత్న మరణంతో తారక్ కూడా బాధలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో తన సినిమా ఓపెనింగ్ చేసుకోవడం భావ్యం కాదని భావించిన ఎన్టీఆర్.. మరో డేట్‌కు దీన్ని పోస్ట్ పోన్ చేసారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

ఇక కళ్యాణ్ రామ్ కూడా తన సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా వేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజుల కింది వరకు జరిగింది. కానీ అమిగోస్ ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాను కొన్ని రోజులు వాయిదా వేసుకున్నాడు కళ్యాణ్. అంతలోనే తమ్ముడు తారకరత్న హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడంతో.. మళ్లీ షూటింగ్ వైపు వెళ్లలేదు. ఇప్పుడాయన చనిపోవడంతో.. డెవిల్ షెడ్యూల్స్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలకు సూచించాడు కళ్యాణ్ రామ్. మొత్తానికి తారకరత్న మరణం తాలూకు ప్రభావం నందమూరి హీరోల సినిమాలపై తీవ్రంగా పడింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Kodali Nani | తారకరత్న రాజకీయ ఎంట్రీపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Tarakaratna | NTR పేరు వచ్చేలా పిల్లలకు నామకరణం చేసిన తారకరత్న.. తాత అంటే ఎంత ప్రేమో కదా!

Nandamuri Tarakaratna | తారకరత్న చేతిపై బాలయ్య టాటూ.. బాబాయ్‌ అంటే ఎంత ప్రేమో !!

Nandamuri Tarakaratna | హీరోగా సక్సెస్ కాలేకపోయినా.. విలన్‌గా మారి నంది అవార్డు గెలుచుకున్న నందమూరి హీరో

Nandamuri Balakrishna | బాలయ్య కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నాడు.. అందుకే పెంచేశాడు..!

Exit mobile version