Home Latest News Union Budget 2023 | నిర్మలమ్మ కరుణించేనా.. కేంద్ర బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలు.. శ్లాబుల్లో...

Union Budget 2023 | నిర్మలమ్మ కరుణించేనా.. కేంద్ర బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలు.. శ్లాబుల్లో ఈసారైనా మార్పులుండేనా ?

Union Budget 2023 | కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశ పెడుతుందంటే అందరికంటే ముందుగా ఆశలు పెంచుకునేది వేతన జీవులే. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అనేక పన్ను మినహాయింపులను వేతన జీవులు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు ప్రవేశపెట్టబోయే తాజా బడ్జెట్‌లో వేతన జీవులు ఏం ఆశిస్తున్నారంటే..

♙ 2022 ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం సగం ఆదాయపు పన్ను రిటర్న్‌లలో 50 శాతం వేతన జీవులవే. వీరంతా కూడా 2023 బడ్జెట్‌ తమకు పూర్తి ఆరోగ్య సంరక్షణ, పదవీ విరమణ తరువాత దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలాగా సరసమైన ధరల్లో గృహాలను ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.

♙ ప్రస్తుతం టాక్స్‌ శ్లాబుల లెక్కల ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి దాదాపు రూ.2.5 లక్షలుగా ఉంది. దీన్ని కనీసం రూ.5 లక్షలకు పెంచాలని చాలా కాలం నుంచి వేతన జీవులు కోరుకుంటున్నారు. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుదల కారణంగా ఈ మినహాయింపును ఆశిస్తున్నారు.

♙ 8 ఏళ్లుగా ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలను మార్చలేదు. హోమ్‌ లోన్‌ తీసుకునే వారు రూ.2 లక్షల వరకు వడ్డీ చెల్లింపును మినహాయింపుగా చూపవచ్చు. దీనికి సెక్షన్‌ 24 B కింద మినహాయింపు కూడా కోరుకోవచ్చు.

♙ అలాగే ప్రస్తుతం సెక్షన్‌ 80 E కింద ఎడ్యుకేషన్‌ లోన్ల పై చెల్లించే వడ్డీని మాత్రమే ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కోరవచ్చు. దీన్ని పర్సనల్‌ లోన్లకూ కూడా వర్తింపజేయాలని కోరుతున్నారు.

♙ ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలుగా ఉంది. దీనిని 2023 బడ్జెట్‌లో కనీసం లక్షకైనా పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు. ప్రభుత్వ పొదుపు పథకాలైన నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ , పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ తదితర పథకాల్లో పొదుపు చేసుకునేలా ప్రొత్సహించేందుకు సెక్షన్‌ 80 C, సెక్షన్‌ 80 D పరిమితులను పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు.

♙ 80C రూ.3 లక్షలకు, 80D రూ.లక్షకు పెంచాలని కోరుతున్నారు. ఆరోగ్య సేవలు ఖరీదైన నేపథ్యంలో ఈ మినహాయింపులు కావాలని ఆశిస్తున్నారు.

♙ 80 EEA, 80 EEBలపై మినహాయింపును మరో రెండేళ్ల పాటు పొడిగించాలని కోరుతున్నారు. సెక్షన్‌ 80 TTA కింద పరిమితిని కనీసం రూ.30 వేలకు పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CIBIL SCORE | బ్యాంకు లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ సిబిల్ స్కోర్ పడిపోకుండా ఇలా జాగ్రత్త పడండి.

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Personal Finance | ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Phone Pe | ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఏ యాప్‌ నుంచి ఎంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చో తెలుసా !

Exit mobile version