Home Latest News CIBIL SCORE | బ్యాంకు లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ సిబిల్ స్కోర్...

CIBIL SCORE | బ్యాంకు లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ సిబిల్ స్కోర్ పడిపోకుండా ఇలా జాగ్రత్త పడండి.

Image by pch.vector on Freepik

CIBIL SCORE | సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయ్ అద్దె ఇంట్లో ఉండి విసుగెత్తిపోయాడు. సొంతంగా ఓ ఫ్లాట్ తీసుకోవాలని ఆశపడ్డాడు. ఎలాగూ కొంచెం సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి మిగిలిన డబ్బులకు లోన్ తీసుకుంటే సొంతింటి కల సాకారం అవుతుందని భావించాడు. ముందుగా బ్యాంకుకు వెళ్లి తనకు లోన్ ఎంత వస్తుందా? అని తెలుసుకున్నాడు. అప్పుడు సిబిల్ స్కోర్ చూసిన బ్యాంకు అధికారులు 750పైగానే క్రెడిట్ స్కోర్ ఉంది లోన్ ఈజీగానే వస్తుందని చెప్పారు. దీంతో మంచి ఫ్లాట్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. సిటీ మొత్తం జల్లెడ పట్టి తనకు అనుకూలంగా ఉన్న ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. దానికి లోన్ అప్లై చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. అతని అప్లికేషన్ ప్రాసెస్ చేసిన అధికారులు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని లోన్ రిజెక్ట్ చేశారు.

ఈ నాలుగు నెలల టైమ్‌లో విజయ్‌ ఎలాంటి క్రెడిట్‌ కార్డు వాడలేదు. ఏ బిల్లులకు కూడా లేట్‌ పేమెంట్స్‌ చేయలేదు. చేసిందల్లా ఒక్కటే.. ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్‌కు లోన్‌ వస్తుందో తెలుసుకుందామని పలు బ్యాంకుల చుట్టూ తిరిగాడు. దీంతో సిబిల్‌ స్కోర్‌ పడిపోయింది. క్రెడిట్‌ స్కోర్‌ లేదని లోన్‌ రిజెక్ట్‌ కావడంతో సొంతింటి కల వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క విజయ్‌ మాత్రమే కాదు చాలామందికి ఇలాంటి సమస్య ఎదురై ఉంటుంది. అలా సిబిల్‌ స్కోర్‌ ఎందుకు తగ్గిపోతుంది? అలా సిబిల్‌ తగ్గకుండా ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం.

హోమ్‌ లోన్‌ తీసుకోవాలని అనుకున్నప్పుడు చాలామంది వివిధ బ్యాంకుల్లోని వడ్డీ రేట్లను చెక్‌ చేసుకుంటారు. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్‌ చూపించి ఎంతవరకు లోన్‌ వస్తుంది.. వడ్డీ రేటు ఎంత పడుతుంది వంటి వివరాలు అన్ని తెలుసుకుంటారు. దీనికోసం నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ నెలలో మూడు బ్యాంకుల్లో ఎంక్వైరీ చేస్తే.. తర్వాత నెలలో ఇంకో మూడు బ్యాంకులు.. ఆ తర్వాత మరో మూడు బ్యాంకులు అన్నట్టుగా తిరుగుతారు. అలా బ్యాంకుకు వెళ్లిన ప్రతిసారి అక్కడి సిబ్బంది మన సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేస్తారు. అలా చెక్‌ చేసిన ప్రతి ఒక్క హార్డ్‌ ఎంక్వైరీకి మన సిబిల్‌ స్కోర్‌లో నుంచి కొంతమొత్తం తగ్గిపోతుంది. అలా మూడు నాలుగు నెలల్లో అన్ని బ్యాంకులు తిరిగేసరికి.. మన సిబిల్‌ స్కోర్‌ పాతాళానికి పడిపోతుంది. ఇలా సిబిల్‌ స్కోర్‌ తగ్గకుండా అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లను చెక్‌ చేసుకునేందుకు ఒక చిట్కా ఉంది.

అదేంటంటే.. 14 రోజుల వ్యవధిలో ఎన్నిసార్లు సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేసినా అది ఒక్క హార్డ్‌ ఎంక్వైరీగానే పరిగణిస్తారు. 14 రోజులు దాటితే రెండో ఎంక్వైరీగా పరిగణిస్తారు. కాబట్టి మనం బ్యాంక్‌ లోన్‌ తీసుకోవాలని ఫిక్సయితే.. అన్ని బ్యాంకుల్లోని వడ్డీ రేట్లను ఈ పద్నాలుగు రోజుల్లోనే తెలుసుకోవాలి. అప్పుడు అన్ని బ్యాంకుల్లో చేసిన ఎంక్వైరీ మొత్తాన్ని ఒక్క హార్డ్‌ ఎంక్వైరీగానే ఆర్బీఐ పరిగణిస్తుంది. కాబట్టి సిబిల్‌ స్కోర్‌పై పెద్దగా ఎఫెక్ట్‌ అవ్వదు. పైగా అన్ని బ్యాంకుల్లోని వడ్డీ రేట్లను తెలుసుకోవచ్చు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Phone Pe | ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఏ యాప్‌ నుంచి ఎంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చో తెలుసా !

Pan Card Number | మీ పాన్ నంబర్ మాటిమాటికి మరిచిపోతున్నారా? ఈ చిన్న లాజిక్‌తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు

Aadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Exit mobile version