Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsWeather Report | ఇవాల్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు...

Weather Report | ఇవాల్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ..

Weather Report | తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావమే ఇందుకు కారణమని వెల్లడించింది. దీని ప్రభావంతో గరిష్ఠంగా 37 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠంగా 25 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఖమ్మంలో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కామారెడ్డి, నిర్మల్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ 3వరకు ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఎండలు దంచికొడతాయని అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

హైదరాబాద్ వాసులకు అలర్ట్‌..

ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఏప్రిల్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికారులు సూచించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSRTC | సామాన్యులకు షాక్‌.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

IPL 2023 | ఐపీఎల్‌లో గుజరాత్‌ శుభారంభం.. 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుచేసిన హర్దిక్‌ సేన

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News