Home Latest News Rains in Telangana | తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్...

Rains in Telangana | తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ

Rains in Telangana | రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజానికి రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రెండో రోజుల ముందు నుంచే వాతావరణ శాఖ సూచించింది. కానీ ఓవైపు విపరీతమైన ఎండలు కొడుతుంటే వర్షాలు ఎందుకు పడతాయిలే అని అంతా అనుకున్నారు. కానీ గురువారం మధ్యాహ్నం వరకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

అప్పటివరకు భానుడు విజృంభించినప్పటికీ ఒక్కసారిగా చల్లబడ్డాడు. కాసేపటికే చల్లటి గాలులు మొదలయ్యాయి. అంతలోనే గాలులు కాస్తా ఈదురు గాలులుగా మారాయి. ఉరుములు మెరుపులతో హోరెత్తింది. హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఇక సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, రంగారెడ్డి, చేవెళ్ల లాంటి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.

పశ్చిమ బెంగాల్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ఏర్పడటంతో.. బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో గురువారం తెలంగాణ వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో గాలులు వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉంటుందని.. వడగళ్ల వాన పడొచ్చనేది వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్ర, రాయలసీమలోనూ పలుచోట్ల వానలు కురుస్తాయని తెలిపింది. రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

Exit mobile version