Home Latest News Doctor Preethi | డాక్టర్‌ ప్రీతి కేసులో కీలక మలుపు.. లభించిన ఆధారం!

Doctor Preethi | డాక్టర్‌ ప్రీతి కేసులో కీలక మలుపు.. లభించిన ఆధారం!

Doctor Preethi | తెలంగాణలో సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఇప్పటికే.. యాంటీ ర్యాగింగ్‌ కమిటీ, పోలీసులు విచారణ వేగవంతం చేయగా ఓ జూనియర్‌ మెడికో వాంగ్మూలాన్ని రికార్డు చేయడం జరిగింది. దీంతో ఈ కేసులో ప్రస్తుతం ఈ వాంగ్మూలమే ప్రధానం కానుంది.

పోలీస్‌ విచారణలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలో కీలక జూనియర్‌ డాక్టర్ విషయాలను అధికారులుకు తెలిపినట్లు తెలుస్తోంది. ప్రీ అనస్థీషియా రిపోర్ట్‌ వివాదంలో డాక్టర్ సైఫ్‌ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను డాక్టర్‌ ప్రీతి ఓ జూనియర్‌కు తెలిపినట్లు సమాచారం. పీఏసీ రిపోర్ట్‌ విషయంలో డాక్టర్‌ సైఫ్‌ ఫిజికల్‌గా లేకపోయినప్పటికీ కూడా డాక్టర్‌ ప్రీతిని బ్లేమ్‌ చేసినట్లు నిర్ధారించారు.

జీఎంహెచ్‌ లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పీఏసీ రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్‌‌లో పొందుపరిచినట్లు విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ వివాదం వివరించి తనకు సపోర్ట్ చేయాలని ప్రీతి అర్థించినట్టు జూనియర్ డాక్టర్ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. తనపై కుట్ర జరుగుతోందని ప్రీతి తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్లు జానియర్ డాక్టర్ తెలిపింది. ఇదే విషయమై లాస్ట్ కాల్‌లో సహ విద్యార్థితో తన ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది.

జూనియర్ డాక్టర్ వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న విచారణ బృందం.. మెడికో ప్రీతి లాస్ట్ కాల్‌పై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తోంది. పీఏసీ రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణలో తెలుస్తోంది.

డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించే తత్వం, దానికి సంబంధించిన చాట్స్ కూడా లభ్యమైనట్టు సమాచారం. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలను బేస్ చేసుకుని పోలీసు అధికారులు కేసులో ముందుకెళ్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Exit mobile version