Monday, March 27, 2023
- Advertisment -
HomeNewsInternationalUSA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

USA | కొద్దిరోజుల క్రితమే చైనా గూఢచార బెలూన్‌ను పేల్చిసిన అగ్రరాజ్యం అమెరికాను మరో అనుమానాస్పద వస్తువు భయపెట్టింది. తమ గగనతంలో అనుమానాస్పద వస్తువు ఎగురుతుండటం గమనించి అమెరికా వెంటనే దాన్ని పేల్చేసింది. అలస్కా ఉత్తర తీరంలో 40 వేల అడుగుల ఎత్తులో పేలోడ్లతో ఈ వస్తువు ఉన్నట్లు గుర్తించామని.. అనుమానాస్పదంగా కనిపించడంతో దాన్ని పేల్చేశామని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు.

దీని గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ముందుగా సమాచారం అందించామని.. ఆయన ఆదేశాల మేరకు దాన్ని కూల్చేశామని జాన్ కిర్బీ తెలిపారు. ఈ వస్తువు గురువారమే అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. ఎఫ్ 22 యుద్ధ విమానం, ఏఐఎం 9 ఎక్స్ క్షిఫణి సాయంతో దాన్ని పేల్చేసినట్లు తెలిపారు. నీటి ఎగువన జనాభా చాలా తక్కువగా ఉన్న ప్రాంతంలో ఎగురుతుండటం గమనించి పేల్చివేసిటనట్లు చెప్పారు. శిథిలాలు కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

అయితే దీన్ని ఎవరు ప్రయోగించారో.. ఏ సంస్థకు చెందినదో అర్థం కావడం లేదని తెలిపారు. అసలు దీన్ని ఎందుకు ప్రయోగించారో కూడా తెలియదని అధికారులు వివరించారు. చైనాకు చెందిన బెలూన్‌ మాత్రం పూర్తిగా గూఢచర్యం కోసం ప్రయోగించినదగానే కిర్బీ తెలిపారు. ఇప్పుడు పేల్చిన వస్తువు సుమారు 40 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ వచ్చిందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే చెప్తామన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Rana Daggubati | దగ్గుబాటి సురేశ్, రానాలపై క్రిమినల్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు

Telangana Secretariat | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News