Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentRana Daggubati | దగ్గుబాటి సురేశ్, రానాలపై క్రిమినల్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు

Rana Daggubati | దగ్గుబాటి సురేశ్, రానాలపై క్రిమినల్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు

Rana Daggubati | టాలీవుడ్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు, నటుడు రానాపై క్రిమినల్ కేసు నమోదైంది. భూవివాదం కేసులో వీరిద్దరికీ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఫిలింనగర్‌లోని స్థలం అమ్ముతామని డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు సమన్లు జారీ చేసింది. వ్యాపారి ఫిర్యాదును కాగ్నిజెన్స్‌గా తీసుకున్న నాంపల్లి కోర్టు తదుపరి విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది. జనవరి 19న జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం ఫిలింనగర్ కోఆపరేటివ్ సొసైటీలో హీరో వెంకటేశ్‌కు 1007 చదరపు గజాల ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను ఓ హాటల్ ఏర్పాటు కోసం ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికి 2014లో దగ్గుబాటి ఫ్యామిలీ లీజుకిచ్చింది. అలాగే పక్కనే ఉన్న సినీ నటి మాధవికి చెందిన ఫ్లాట్ నంబర్ 2ను సురేశ్ బాబు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో 2018 ఫిబ్రవరిలో ప్రమోద్ కుమార్ లీజు ముగుస్తుండటంతో ఫ్లాట్ నంబర్ 2లోని స్థలాన్ని 18 కోట్లకు అమ్మేందుకు సురేశ్‌బాబు ఒప్పుకున్నాడు.

దీంతో రూ. 5కోట్లు చెల్లించి ప్రమోద్ కుమార్, మరికొంతమంది సేల్ డీడ్ కుదుర్చుకున్నారు. అంతకుముందే లీజ్ గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదంటూ ప్రమోద్‌పై సురేశ్‌బాబు ఓ కేసు వేశారు. స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చారు. ఈ క్రమంలో తన వద్ద రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రమోద్ కుమార్ కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో లీజ్ అలాగే కొనసాగించమని న్యాయస్థానం ఆదేశించింది. అలా దీనిపై వివిధ కోర్టుల్లో 5 కేసులు ఉన్నాయి.

ఇలా కేసు ఓ కొలిక్కి రాకముందే ఫ్లాట్ నంబర్ 2 స్థలాన్ని సురేశ్ బాబు తన కుమారుడు రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ క్రమంలో నవంబర్ 1 కొంతమంది ఆ స్థలానికి వచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీని తరిమేశారు. ప్రమోద్‌ను బెదిరించారు. దీంతో ప్రమోద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు పట్టించుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసును కాగ్నిజెన్స్‌గా తీసుకుని సురేశ్ బాబు, రానాలకు సమన్లు జారీ చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Prabhas – Kriti Sanon | మాల్దీవుల్లో ప్రభాస్‌తో కృతిసనన్‌ ఎంగేజ్‌మెంట్‌.. అసలు నిజమిదీ !!

Samyuktha | మా నాన్న పేరు అడ్డుగా అనిపించింది.. అందుకే తీసేస్తున్నా.. మలయాళ బ్యూటీ సంయుక్త సంచలన నిర్ణయం

Kirak RP | కిరాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు వాళ్ల భిక్షే.. జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్ రాకేశ్‌ సెన్సేషల్‌ కామెంట్స్‌

Kutty Padmini | రూంలో అడ్జస్ట్‌ అవ్వమని దర్శకులు అడిగారు.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే అదృష్టం లేకపోయింది.. బయటపెట్టిన సీనియర్‌ నటి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News