Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsFormula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల...

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Formula-E Race | హైదరాబాద్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరే సందర్భం. విశ్వనగరంగా మారుతున్న భాగ్యనగరం అంతర్జాతీయ క్రీడా టోర్నీకి వేదిక కానున్న క్షణం. మరికొద్ది గంటల్లో ఫార్ములా ఈ రేసు ప్రారంభమవుతుండటంతో ట్రాక్‌పై ప్రాక్టీస్‌ చేస్తున్న రేసర్లకు హైదరాబాద్‌ వాహనదారులు షాకిచ్చారు.

భారత్‌లోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు జరగనుండటంతో సర్వం సిద్ధం చేశారు. హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ చివరి సిరీస్‌ నిర్వహించనున్నారు. దీంతో నెక్లెస్‌ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్‌, సెక్రటేరియట్‌ నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్‌, మింట్‌ కాంపౌండ్‌, ఐమ్యాక్స్‌ వరకు లీగ్‌ కొనసాగనుంది. దీంతో ఈ మార్గంలో ఆంక్షలు విధించారు. శనివారం రోజు ఫార్ములా ఈ రేసు జరగనుండటంతో శుక్రవారం నాడు రేసర్లు ప్రాక్టీసు 1 రేసు నిర్వహించారు. ఈ సమయంలో ఫార్ములా ఈ రేసర్లకు హైదరాబాద్‌ వాహనదారులు షాకిచ్చారు.

ప్రాక్టీస్‌ రేసు జరుగుతున్న సమయంలో బారికేడ్లను తొలగించుకుని ట్రాక్‌పైకి దూసుకొచ్చారు. ఈ హఠాత్పరిణామంతో రేసర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రైవేటు వాహనాలు ట్రాక్‌పైకి రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని వాహనదారులను అడ్డుకున్నారు. అయితే భద్రతాసిబ్బందిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేసుల కారణంగా గంటలు గంటలు వాహనాలు నిలిచిపోతున్నాయని.. రేసుల కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. మీకు రేసులు ముఖ్యమా? ప్రజలు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. మొత్తానికి ఫార్ములా ఈ ట్రాక్‌ పై గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ప్రాక్టీస్‌ రేసు నిలిపివేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

TSRTC | పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌!

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Narendra Modi | దేశం కోసమే నా జీవితం అంకితం చేశా.. కాంగ్రెస్‌ వల్ల దశాబ్ద కాలాన్ని కోల్పోయాం.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News