Home News International US Air Force | అమెరికా విమానంపై దాడి చేయబోయిన చైనా యుద్ధ విమానం.. పైలట్...

US Air Force | అమెరికా విమానంపై దాడి చేయబోయిన చైనా యుద్ధ విమానం.. పైలట్ చాకచక్యంతో జస్ట్ మిస్

Image Souce: @nertilqatja twitter

US Air Force | అగ్రరాజ్యం అమెరికా నిఘా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. అమెరికా విమానానికి అత్యంత సమీపంలోకి వెళ్లిన డ్రాగన్ ఫైటర్ జెట్ ఢీకొట్టబోయింది. అమెరికా ఫైలట్ చాకచక్యంతో వ్యవహరించి ప్రమాదాన్ని నివారించాడు. డిసెంబర్ 21న ఈ ఘటన జరగ్గా తాజాగా యూఎస్-ఇండో-పసిఫిక్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది.

దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా, చైనా మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తున్న అమెరికా ఎయిర్‌ఫోర్స్ విమానాన్ని ( RC-135 ) చైనా యుద్ధ విమానం టార్గెట్ చేసింది. అమెరికా నిఘా విమానానికి ఎదురుగా 6 మీటర్ల దూరం దూసుకొచ్చిందని అమెరికా తెలిపింది. యూఎస్ పైలట్ అప్రమత్తమై ప్రమాదాన్ని తప్పించాడని తెలిపింది. కాగా, దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో చట్టపరంగానే తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమెరికా స్పష్టం చేయగా.. చైనా నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

వివాదమేంటి?

దక్షిణ చైనా సముద్రంపై హక్కు తమకే ఉంటుందని చైనా వాదిస్తోంది. దీనిపై అంతర్జాతీయ కోర్టు చైనాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. చైనాకు దక్షిణ సముద్రంపై ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. దీంతో అమెరికా అక్కడ యుద్ధ విమానాలు, నౌకలను మోహరించింది. ఇది చైనాకు మింగుడుపడలేదు. ఈ విషయంలో చైనా కూడా వెనక్కి తగ్గట్లేదు. అక్కడి నుంచి యుద్ధ విమానాలు, నౌకలను ఖాళీ చేయాలని పలుమార్లు డిమాండ్ చేసింది. చైనా డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోని అమెరికా అక్కడ రెగ్యులర్‌గా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే అమెరికా నిఘా విమానం ( RC-135 ) చక్కర్లు కొడుతుండగా.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవికి చెందిన J-11 యుద్ధ విమానాన్ని పంపించింది. అయితే పైలట్ అప్రమత్తతో తృటిలో ప్రమాదం తప్పింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!

Exit mobile version