Home News International Earthquake | తుర్కయే, సిరియా భూకంపంలో 9 వేల మంది మృతి.. ఇంకా శిథిలాల కిందే...

Earthquake | తుర్కయే, సిరియా భూకంపంలో 9 వేల మంది మృతి.. ఇంకా శిథిలాల కిందే 1 .80 లక్షల మంది!

Earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో విరుచుకుపడిన భూకంపం దాటికి ఇప్పటివరకు 9 వేల మంది మృతి చెందారు. 1.80 లక్షల మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు. దాదాపు 2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు 25 వేల మంది సహాయక సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, భూకంపం దాటికి 20 వేల మందికి పైగా మృతి చెంది ఉంటారని అంచనా వేసింది. ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి ఇరు దేశాలను ఆదుకోవాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది.

కాగా, సోమవారం నుంచి ప్రకపంనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 48 గంటల్లోనే 435 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనతో రోడ్లమీదే ఉంటున్నారు. భూ ప్రకంపన దాటికి సిరియా, తుర్కియే దేశాల్లోని వేలాది భవనాలు నేలమట్టమవుతూనే ఉన్నాయి.

మరోవైపు సిరియా, తుర్కియేను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే 70కి పైగా దేశాలు రెస్క్యూ , వైద్య సిబ్బందిని పంపించాయి. ఆహార పదార్థాలను చేరవేస్తున్నాయి. భారత్ కూడా ఎక్స్ రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లను అందజేసింది. నిత్యావసరాలు, వైద్య పరికరాలతో రెండు విమానాలను పంపనుంది.

అయితే విపరీతమైన చలి వణికిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. మరోవైపు పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పది ప్రావిన్స్‌లలో మూడు నెలలపాటు అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

తుర్కియే, సిరియాల్లోని ఆస్పత్రుల్లో పరిస్థితి హృదయ విధారకంగా ఉంది. ఒకవైపు శవాల గుట్టలు, మరోవైపు చావు బతుకుల మధ్య క్షతగాత్రులు కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యులు సైతం అక్కడి పరిస్థితిని చూసి తల్లిడిల్లిపోతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Mekapati chandrashekar Reddy | వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు!

Supreme Court | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు.. స్టేటస్ కోకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. 17నే విచారణ చేపడతామన్న సీజేఐ!

Jabardasth Punch Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు ఎవరు ఎక్కువగా సాయం అందిస్తున్నారు?

Exit mobile version