Home News International China Vs America | చైనాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్.. మా జోలికి వస్తే...

China Vs America | చైనాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్.. మా జోలికి వస్తే ఊరుకోమంటూ హెచ్చరిక!

Image Source: Pixabay

China Vs America | అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య ఉద్రికత్త వాతావరణ నెలకొంది. చైనాకు చెందిన నిఘా బెలూన్ ఇరు దేశాల మధ్య ఉత్రిక్తతలు పెంచింది. అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్ ప్రవేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే చర్యలకు ధీటుగా బదులిస్తామని బైడెన్ హెచ్చరించారు.

అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన బైడెన్.. అమెరికాను కాపాడేందుకు ఎంతటి తీవ్ర చర్యకైనా వెనకాడబోనని స్పష్టం చేశారు. అమెరికా ప్రజల ప్రయోజనాలతో పాటు ప్రపంచ లబ్ధి కోసం చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే అమెరికా సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా చైనా వ్యవహరిస్తే మాత్రం ఊరుకోబోనని, ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనాతో పోటీని కోరుకుంటున్నామని, ఘర్షణనని కాదు అంటూ గత వారమే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేసినట్లు బైడెన్ వివరించారు.

అమెరికా అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని బైడెన్ వెల్లడించారు. మేడిన్ అమెరికాకే అధిక ప్రాధాన్యత ఇస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Mekapati chandrashekar Reddy | వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు!

Supreme Court | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు.. స్టేటస్ కోకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. 17నే విచారణ చేపడతామన్న సీజేఐ!

Jabardasth Punch Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు ఎవరు ఎక్కువగా సాయం అందిస్తున్నారు?

Exit mobile version