Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsTSRTC | పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌!

TSRTC | పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌!

TSRTC | పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పెళ్లిళ్ల తో పాటు మరికొన్ని శుభకార్యాల కోసం అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని ఇవ్వనున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ తెలిపింది.

శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అద్దె బస్సులపై 10 శాతం రాయితీని ఇస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం వరకు రాయితీ అమల్లో ఉంటుందని బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, సజ్జనార్‌ తెలిపారు.

ప్రైవేట్‌ వాహనాల కన్నా కూడా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తున్నట్లు వారు వివరించారు. బస్సు బుకింగ్ కోసం ఎలాంటి నగదు డిపాజిట్లు కూడా అక్కర్లేదని తెలిపారు. పైగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం సురక్షితమని కూడా పేర్కొన్నారు.

శుభకార్యాలు, పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులకు వినియోగించుకుని టీఎస్‌ఆర్టీసీని ప్రోత్సహించాలని కోరారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌ను బట్టి అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని రకాల బస్‌ సర్వీస్‌ లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. అద్దె బస్సుల బుకింగ్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Teachers Transfers | ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కండీషన్‌తోనే టీచర్ల రిలీవ్

KA Paul | సీఎం క్యాంప్‌ ఆఫీసును తగలబెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు.. కేఏ పాల్‌ ఫైర్‌!

Supreme Court | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు.. స్టేటస్ కోకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. 17నే విచారణ చేపడతామన్న సీజేఐ!

Ponguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాలు

Kadiyam Srihari | ఇక్కడ టైమ్‌ వేస్ట్‌.. ఏపీ వెళ్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి హితవు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News