Monday, March 27, 2023
- Advertisment -
HomeLatest NewsKA Paul | సీఎం క్యాంప్‌ ఆఫీసును తగలబెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు.. కేఏ...

KA Paul | సీఎం క్యాంప్‌ ఆఫీసును తగలబెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు.. కేఏ పాల్‌ ఫైర్‌!

KA Paul | టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సీరియస్‌ అయ్యారు. ప్రగతి భవన్‌ను తగులబెడదామంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బాధ్యతాయుతమైన ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ పదవిలో ఉండి ఎవరైనా ఇలా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ఒక టెర్రరిస్టులా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఎవరు తప్పు చేసినా ఖండిస్తానని కేఏ పాల్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ తప్పు చేసినా నిలదీస్తానని అన్నారు. ప్రగతి భవన్‌ను తగులబెడదామని రేవంత్‌ రెడ్డి ఓ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనిపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తమ టీమ్‌ మెంబర్ జ్యోతి బేగల్‌ డీజీపీతో మాట్లాడారని తెలిపారు.చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్న రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయాలని ఓ లేఖ కూడా పంపించినట్లు చెప్పారు. ఆయనపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇంతకంటే తక్కువ వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను అరెస్టు చేయడం మనం చూశామని చెప్పారు. రేవంత్‌ రెడ్డినే కాదు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మజ్లిస్‌ ఎమ్మెల్యే ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇంకా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు

వేల కోట్లు ఉన్నాయని.. టీపీసీసీ చీఫ్‌ పదవి కొనుకున్న అనే అహంభావంతో.. చట్టాలు నన్ను ఏం చేయగలవని రేవంత్‌ రెడ్డి ఆలోచిస్తున్నారని కేఏ పాల్‌ అన్నారు. చట్టానికి భయపడకుండా ఇంత ఘోరమైన పిలుపునివ్వచ్చా? అని మండిపడ్డారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్ తగలబెట్టాలని పిలుపునిచ్చిన రేవంత్‌ రెడ్డిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మల్లు రవి లేదా ఓ దళితుడ్ని టీపీసీసీ చీఫ్‌ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన.. నోటుకు ఓటు కేసులో ముద్దాయి అయిన వ్యక్తికి ఇంత పెద్ద పదవి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇలా చేస్తే భారత్ జోడో యాత్రను ఎవరు పట్టించుకుంటారని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. ఈ కారణంతోనే సీనియర్‌ నేతలు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌పై ఫైర్‌

ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌పై కూడా కేఏ పాల్‌ విరుచుకుపడ్డారు. రూ.500 కోట్లతో నిర్మించిన పాత సెక్రెటేరియట్‌ కూలగొట్టి.. రూ.610 కోట్లతో కొత్తది కట్టారని అన్నారు. ఇలా డబ్బులన్నీ వృథా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. అంబేడ్కర్ పేరు పెట్టిన సెక్రటేరియట్‌ను ఆయన జయంతి రోజు కాకుండా కేసీఆర్‌ పుట్టిన రోజు నాడు ఓపెన్‌ చేయడాన్ని తప్పుబట్టారు. అంబేడ్కర్‌ జయంతి నాడే సెక్రటేరియట్‌ను ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడున్న పార్టీలు అన్నీ 75 ఏళ్లుగా బడుగు, బలహీనవర్గాలకు అధికారం రాకుండా కుటుంబ, కుట్ర, కుల పాలన చేస్తున్నాయని కేఏ పాల్‌ అన్నారు. అందుకే ఈ పార్టీలను వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరి మద్దతు తెలిపాలని ప్రజలను కోరారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Supreme Court | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు.. స్టేటస్ కోకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. 17నే విచారణ చేపడతామన్న సీజేఐ!

Ponguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాలు

Kadiyam Srihari | ఇక్కడ టైమ్‌ వేస్ట్‌.. ఏపీ వెళ్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి హితవు

Babu mohan | జోగిపేట బీజేపీ కార్యకర్తను బండబూతులు తిట్టిన బాబుమోహన్.. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫైర్

Double Decker Bus | హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్.. డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కేశాయ్‌

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News