Tuesday, July 23, 2024
- Advertisment -
HomeLatest NewsPonguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్...

Ponguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాలు

Ponguleti | బీఆర్ఎస్ పార్టీ నేతలకు పొంగులేటి వ్యవహారం తలనొప్పిగా మారింది. కొద్దిరోజులుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ అధిష్ఠానానికి ఆగ్రహం వచ్చేలా చేస్తున్నారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్సెండ్ చేయాలంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్‌ జెండా వదలడం అంటే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అని పొంగులేటిని హెచ్చరించారు.

పార్టీ బీఫాం తీసుకుని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే నేతలంతా రాజీనామా చేయాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీఆర్ఎస్‌లో ఉండేవాళ్లంతా కేసీఆర్‌కు విధేయులుగా ఉండాలని.. నా బ్రాండ్, నా గ్రూప్ అని ఉంటే కుదరదని స్పష్టం చేశారు. కేసీఆర్ తయారుచేసిన నాయకులు ఇప్పుడు చాలా పెద్దవాళ్లం అని అనుకుంటున్నారని.. ఒక్కసారి కేసీఆర్ చేయి వదిలిపెడితే వాళ్ల గతి అధోగతి అని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో రాజకీయాలు పరిస్థితులను బట్టి ఉంటాయని.. వ్యక్తుల మీద ఆధారపడి కాదని స్పష్టం చేశారు. వైరాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనదేనని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ గాలే వీస్తుందని.. జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎవరు బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా వదులుతారో వారు స్వయంగా వారి బొంద తవ్వుకున్నట్లే అని అన్నారు. కొంతమందికి దమ్ముంటే సస్పెండ్‌ చేయండి అని అంటున్నావు కదా.. నీకు దమ్ముంటే పార్టీకి రాజీనామా చేయి… పార్టీ బీఫామ్‌ తీసుకుని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే కార్యక్రమాలకు పాల్పడే వారిని సస్పెండ్‌ చేస్తాం.. కేసీఆర్ ఇలాంటి ఉడత ఊపులకు భయపడే మనిషి కాదు. కేసీఆర్‌ కి నమ్మకంగా ఉన్నవాళ్లే ఈ పార్టీలో ఉండండి… లేదంటే ఈ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోండి. వైరా మున్సిపాలిటీకి అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రసక్తే లేదు. మేము పెట్టిన కూడే తినండి. ఎన్ని రోజులు ఆ పదవులో ఉంటారో ఉండండి.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

PM Kisan | రైతులకు కేంద్రం మొండిచేయి.. పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన

Kadiyam Srihari | ఇక్కడ టైమ్‌ వేస్ట్‌.. ఏపీ వెళ్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి హితవు

Babu mohan | జోగిపేట బీజేపీ కార్యకర్తను బండబూతులు తిట్టిన బాబుమోహన్.. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫైర్

Teachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News