Home Latest News KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.....

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

KA Paul | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న చేయాల్సిన ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే సెక్రటేరియట్ ఓపెనింగ్ వాయిదా పడటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు సచివాలయ ప్రారంభోత్సవం కాకుండా ఆపగలిగామని అన్నారు.

కేసీఆర్ పుట్టిన రోజు నాడు సెక్రటేరియట్ ఓపెన్ చేయకూడదని న్యాయపోరాటం చేశామని కేఏ పాల్ గుర్తు చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించానని.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ పరిణామాలతో కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ వాయిదా నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తప్పు ఒప్పుకోకుండా ఎన్నికల కోడ్‌ను సాకుగా మధ్యలోకి తీసుకొచ్చాడని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ తగ్గి అంబేడ్కర్ పుట్టిన రోజైన ఏప్రిల్ 14న సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని సూచించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version