Home Latest News Viral | పెద్దలు ఒప్పుకోలేదని కాలేజీలోనే పెళ్లి చేసుకున్న ప్రేమికులు.. వాలంటైన్స్ డేకు ముందు వైరల్‌గా...

Viral | పెద్దలు ఒప్పుకోలేదని కాలేజీలోనే పెళ్లి చేసుకున్న ప్రేమికులు.. వాలంటైన్స్ డేకు ముందు వైరల్‌గా మారిన లవ్ స్టోరీ

Viral | కాలేజీ ప్రాంగణంలో చిగురించిన ప్రేమబంధం అక్కడే ఒక్కటైంది. తమ ప్రేమ పుట్టడానికి వేదిక అయిన విద్యాసంస్థనే ఆ ప్రేమ జంట పెళ్లికి వేదికగా మారింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వేలాది మంది విద్యార్థులు చూస్తుండగానే దండలు మార్చుకుని తమ ప్రేమను గెలిపించుకున్నారు. కేరళ ఎర్నాకుళంలోని మహారాజా కాలేజీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

కేరళలోని ఎర్నాకుళం పట్టణానికి చెందిన నదీమ్, కృపా 2014 -17లో మహారాజా కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా వాళ్ల ప్రేమ ప్రయాణం అలాగే కొనసాగింది. ప్రస్తుతం నదీమ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కృపా న్యాయశాస్త్రం చదవుతోంది. దీంతో తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు. పెళ్లి చేసుకుంటామని కోరారు. కానీ ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో పెద్దలు ఈ పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ వాళ్లు పట్టువిడవలేదు. దీంతో కొద్దిరోజులకు నదీమ్ తల్లిదండ్రులు దిగొచ్చారు. కృపా పేరెంట్స్ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలని కృపా, నదీమ్ నిర్ణయించుకున్నారు.

ఈ నెల 8వ తేదీన పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నారు. అయితే అదే రోజు కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ క్రమంలోనే వేలాది మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు అందరూ చూస్తుండగానే కాలేజీ సెంటర్‌లోని దేవత విగ్రహం ముందు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులందరూ దీన్ని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version