Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsBabu mohan | జోగిపేట బీజేపీ కార్యకర్తను బండబూతులు తిట్టిన బాబుమోహన్.. బండి సంజయ్ ఎవడ్రా...

Babu mohan | జోగిపేట బీజేపీ కార్యకర్తను బండబూతులు తిట్టిన బాబుమోహన్.. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫైర్

Babu mohan | బీజేపీ నేత, మాజీ మంత్రి బాబు మోహన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. జోగిపేట బీజేపీ కార్యకర్త వెంకట రమణను బండబూతులు తిట్టారు. మీతో కలిసి పనిచేస్తానని ఫోన్ చేసిన కార్యకర్తపై విరుచుకుపడ్డాడు. నువ్వెంత.. నీ బతుకెంత అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌నే ఎవడ్రా వాడు అంటూ రెచ్చిపోయారు.

ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేటకు చెందిన వెంకట రమణ అనే బీజేపీ కార్యకర్త బాబుమోహన్‌కు ఫోన్ చేశాడు. సార్ మీతో కలిసి పనిచేద్దామని అనుకుంటున్నా అంటూ తెలిపాడు. కానీ వెంకటరమణపై బాబుమోహన్ తిట్ల పురాణం అందుకున్నాడు. నువ్వెంత నీ బతుకెంత నాతో కలిసి పనిచేస్తావా? అంటూ అతనిపై విరుచుకుపడ్డాడు. నేను రాష్ట్ర నాయకుడిని.. నీకు ఓటు బ్యాంకు ఎంత ఉంది? నాకు ఎంత ఉందో చూసుకుందామా అంటూ అతనికి సవాలు విసిరాడు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఆందోల్‌ను అభివృద్ధి చేశా.. నువ్వెంత బచ్చాగాడివి అంటూ ఎద్దేవా చేశారు. నేను ప్రపంచ స్థాయి నాయకుడిని నాతోనే కలిసి పనిచేస్తావా? నీ బతుకెంత? మరోసారి ఫోన్ చేశావంటే చెప్పుతో కొడతా అంటూ తిట్లపురాణం లంకించుకున్నాడు. పార్టీలో నేను కష్టపడి పని చేశాను అందుకు అమిత్‌ షా అంతటి నేతే నన్ను బీజేపీలో చేర్చుకున్నారు అంటూ తన దర్పాన్ని ప్రదర్శించారు. ఇంకోసారి నాకు ఫోన్‌ చేస్తే చెప్పుతో కొడతానంటూ కార్యకర్తను హెచ్చరించారు.

బాబుమోహన్ తిట్ల పురాణంతో భయపడిపోయిన వెంకటరమణ.. బండి సంజయ్ అన్నతో వచ్చి సారీ చెబుతా అని మాట్లాడాడు. అప్పుడు బాబుమోహన్ మరింత రెచ్చిపోయారు. బండి సంజయ్ ఎవడ్రా.. వాడు నా తమ్ముడు.. నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడూ అంటూ బండబూతులు తిట్టాడు. దీనికి సంబంధించి ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో వెలిగిపోతున్న సమయంలో ఎన్టీఆర్ అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాడు. 1998 ఆందోలు ఉప ఎన్నికలో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 1999 ఎన్నికల్లోనూ గెలవడంతో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన బాబుమోహన్.. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ( అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరాడు. 2014లో ఆందోలు నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఎక్కడపడితే అక్కడ కార్యకర్తలను బండబూతులు తిట్టడం, ప్రశ్నించిన వారిపై విరుచుకుపడటంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. దీంతో 2018 ఎన్నికల్లో బాబు మోహన్‌ను సీఎం కేసీఆర్ పక్కన బెట్టారు. దీంతో బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ చేతిలో దారుణంగా ఓడిపోయారు. కేవలం 2404 ఓట్లు రావడంతో డిపాజిట్ కూడా దక్కలేదు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాబు మోహన్ మళ్లీ ఇలా తిట్ల దండకం అందుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News