Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalTurkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.....

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | కుప్పకూలిన భవనాలు.. చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు.. శిథిలాల కింద చిక్కుకున్న జనాలు.. క్షతగాత్రుల అర్తనాదాలు.. తుర్కియే, సిరియా దేశాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది.. గంటల వ్యవధిలోనే మూడు వరుస భూకంపాల ధాటికి ఇరు దేశాల్లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల్లో ఇప్పటివరకు 4,500కి పైగా మరణించారు. మృతుల సంఖ్య 10 వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే అమెరికా జియోలాజికల్ సంస్థ వెల్లడించగా.. దానికి తగ్గట్టుగానే అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శిథిలాల కింద ఇంకా చాలా మృతదేహాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఉపద్రవాన్ని మూడు రోజుల కిందటే ఊహించారని తెలుసా? ఇంత పెద్ద విపత్తును వస్తుందని ఓ వ్యక్తి ముందే హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే నిజమైంది.

తుర్కియే, సిరియాలో భారీ భూకంప ముప్పు పొంచి ఉందని ఫ్రాంక్ హుగర్‌బీట్స్ అనే వ్యక్తి వెల్లడించాడు. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రిక్ సర్వే సంస్థలో పరిశోధకుడు. అతి త్వరలోనే సౌత్ సెంట్రల్ టర్కీ, జోర్దాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం వస్తుందని తన పరిశోధనలో ఫ్రాంక్ తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని ఫిబ్రవరి 3న ట్విట్టర్ ద్వారా హెచ్చరించాడు. అయితే ఈ ట్వీట్‌ను చాలామంది కొట్టిపారేశారు. ఫ్రాంక్ ఒక నకిలీ శాస్త్రవేత్త.. గతంలో కూడా ఈయన చాలా అంచనాలు వేశాడని.. ఏవీ నిజం కాలేదంటూ విమర్శించారు.

ఆయన గురించి చులకనగా మాట్లాడారు. కానీ మూడు రోజుల తర్వాత అదే నిజమైంది. వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా అల్లకల్లోలంగా మారాయి. వీటి ప్రకంపనలు లెబనాన్ వరకు వెళ్లాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఫ్రాంక్ చెప్పింది ముందే వినిపించుకోలేదని చాలామంది పశ్చాత్తాపడుతున్నారు. తన అంచనా నిజమవ్వడంపై ఫ్రాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతమంది ప్రకృతి విలయానికి బాధించపడటం బాధగా ఉందని తెలిపాడు. క్రిటికల్ ప్లానెటరీ జియోమెట్రీ కారణంగా ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Revanth Reddy | ఉద్యోగాలు రావాలంటే మార్పు రావాల్సిందే.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Ponguleti Srinivas reddy | దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయండి.. బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి పొంగులేటి సవాల్‌!

Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News