Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsTeachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్

Teachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్

Teachers | టీచర్ల బదిలీ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 317 జీవో కింద బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జీవో నంబర్ 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ సర్వీసును వదులుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో బదిలీల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం 317 జీవో కింద బదిలీ అయిన ఉపాధ్యాయుల పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. 317 జీవో కింద బదిలీ అయిన టీచర్లు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News