Tuesday, May 28, 2024
- Advertisment -
HomeLatest NewsPM Kisan | రైతులకు కేంద్రం మొండిచేయి.. పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన

PM Kisan | రైతులకు కేంద్రం మొండిచేయి.. పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన

PM Kisan | రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు తీసుకొచ్చినట్టే.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలను మూడు సమాన వాయిదాల్లో రైతులకు అందజేస్తుంది. ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాలోనే వేస్తుంది. అయితే పీఎం కిసాన్ కింద రైతులకు ఇస్తున్న మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.8వేలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని అంతా ఆశించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపించింది.

పీఎం కిసాన్ కింద రైతులకు అందజేస్తున్న డబ్బును పెంచే ఉద్దేశమేదీ లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో పీఎం కిసాన్ డబ్బులు పెంచుతున్నారా? అని పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని అడిగారు. దీనికి స్పందించిన నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వక సమాధానమిచ్చారు. 13వ విడత పీఎం కిసాన్ నిధి కింద రూ.2.24 లక్షల కోట్లను జనవరి 30లోపు రైతుల ఖాతాలో వేసినట్లు తెలిపారు.

ఇప్పటివరకు 12 వాయిదాల్లో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. అయితే 12వ విడతలో పలువురు రైతులకు ఆర్థిక సాయం అందలేదు. కేవైసీ పూర్తి చేయకపోవడం వల్లనే వారికి డబ్బులు అందలేదు. వారిలో ఇప్పటికీ కొందరు కేవైసీ పూర్తి చేయలేదు. వారికి ఈసారి కూడా డబ్బులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే అనర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిపై మరింత సమాచారం కోసం స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని కలవాలని లేదా అగ్రికల్చర్ పోర్టల్ ద్వారా సమాచారం పొందాలని సూచిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Teachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News