Home Latest News Minister KTR | ప్రస్తుతం అందరి చూపు కేసీఆర్ వైపు… తెలంగాణ వైపే!

Minister KTR | ప్రస్తుతం అందరి చూపు కేసీఆర్ వైపు… తెలంగాణ వైపే!

Minister KTR | తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉందన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్‌ నాయకత్వం వైపు ఉందన్నారు.

రోజుకు మూడు డ్రెస్‌లు మార్చుకోవడం కాదు… అనుకున్న లక్ష్యం కోసం పనిచేయాలన్నారు. ప్రతిపక్ష బీజేపీ నేత రఘునందన్‌ రావు చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు.అన్ని వర్గాల వారి కలలు తెలంగాణలో నెరవేరుతున్నాయన్నారు. ప్రతిపక్షాల కలలు కల్లలవుతున్నాయన్నారు. ఏ వర్గాన్ని విస్మరించకుండా పనిచేస్తున్నామని వివరించారు. తెలంగాణ డెవలప్ మెంట్ దేశంలోనే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న విషయమన్నారు.

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు. దీనిలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా సలామ్‌ అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో కూడా నెంబర్ 1 గానే ఉన్నామని పేర్కొన్నారు. 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు జమ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని వివరించారు.

దేశ్యవాప్తంగా కేసీఆర్‌ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థిక వేత్త లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు.. ఇంతటి దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలోనే ఎక్కడా ఉండరని విమర్శించారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని మొత్తం ప్రచారం చేస్తామని ఆయన అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రకటించారు.

తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయి… నాబార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా నమ్మరా అని విపక్ష నేతల్ని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణీలా మారింది. మంచిగా విమర్శించండి అంతేకానీ రాష్ట్రాన్ని మాత్రం కించపరచకండి…ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామని కేటీఆర్ లెక్కలు వివరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Income Tax | వేతన జీవులకు పాత పన్ను విధానం బెటరా.. కొత్త పన్ను విధానమా ?

Adani | అదానీ సంస్థలకు మరో షాక్.. అక్కడ నుంచి కూడా ఔట్!

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Exit mobile version