Home Business Adani | అదానీ సంస్థలకు మరో షాక్.. అక్కడ నుంచి కూడా ఔట్!

Adani | అదానీ సంస్థలకు మరో షాక్.. అక్కడ నుంచి కూడా ఔట్!

Adani | ఎంత స్పీడుగా కుబేరుల జాబితాలోనికి వచ్చారో అంతే స్పీడుతో కిందకి జారిపోతున్నారు గౌతమ్‌ అదానీ. కష్టాలు, నష్టాలు అన్ని ఒకదాని తరువాత ఒకటి ఆయన్ని చుట్టుముడుతున్నాయి. జనవరి 23 న ఏ టైమ్‌లో హిండెన్‌ బర్గ్ రీసెర్చ్ ( Hindenburg Research ) రిపోర్ట్ బయటకు వచ్చిందో కానీ, అప్పట్నుంచి అదానీ పరిస్థితి మరి దారుణంగా తయారయ్యింది.

ఇప్పటికే ఉన్న దారులన్ని మూసుకుపోయాయి అనుకుంటుంటే.. మరిన్ని కొత్త సమస్యలు ఆయన్ను వెంటాడుతున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీలు అనైతిక చర్యలకు, అక్రమాలకు పాల్పడినట్లు తన నివేదికలో హిండెన్‌ బర్గ్‌ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ను డో జోన్స్‌ సస్టైనబిలిటీ ఇండెక్స్‌ నుంచి తొలగించనున్నట్లు సమాచారమిచ్చారు.

దీంతో అదానీ పరువు ఇంటర్నేషనల్‌ లెవల్‌ లో గంగలో కలిసింది. అకౌంటింగ్‌లో మోసం ఆరోపణల కారణంతో వెలువడిన మీడియా, వాటాదార్ల రిపోర్ట్‌ల తర్వాత, అదానీ ఎంటర్ ప్రైజెస్ డో జోన్స్‌ సస్టైనబిలిటీ సూచిక నుంచి తీసివేస్తున్నట్లు డో జోన్స్‌ ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 7 న మార్కెట్‌ ప్రారంభానికి ముందే డో జోన్స్‌ సస్టైనబిలిటీ సూచీలో మార్పులు అమల్లోకి వస్తాయని డో జోన్స్‌ పేర్కొంది.

కార్పొరేట్‌ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ ద్వారా ఎస్‌ అండ్ పీ గ్లోబల్ సెలెక్ట్‌ చేసిన కంపెనీల పని తీరును కొలిచే క్యాపిటలైజేషన్‌ వెయిటెడ్ సూచీలు ఈ డో జోన్స్‌ సస్లైనబిలిటీ ఇండెక్స్‌. ఈఎస్‌జీ ప్రమాణాలను పాటించే ప్రపంచ స్థాయి కంపెనీలను ఎస్ అండ్ పీ గ్లోబల్‌ ఈ సూచీలోకి ఎంచుకుంటుంది. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్ బీఎమ్ఐలోని టాప్ 2,500 కంపెనీల్లో టాప్ 10 శాతం డో జోన్స్‌ సస్టైనబిలిటీ ఇండెక్స్ ప్రాతినిధ్యం వహిస్తుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఒక్కటే కాకుండా, అదానీ గ్రూప్‌ స్టాక్స్ అన్నీ ప్రస్తుతం ఫ్రీఫాల్‌లో ఉన్నాయి. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ గత వారం ఆరోపణలు చేసినప్పటి నుంచి పెట్టుబడిదార్ల సంపద 40% పైగా క్షీణించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Free Flight Tickets | హాంకాంగ్ బంపర్ ఆఫర్.. 5 లక్షల మందికి ఫ్రీగా విమాన టికెట్లు

Gautam Adani | గౌతమ్ అదానీని ఆదుకున్న ఆ ఇద్దరు రహాస్య స్నేహితులు ఎవరు.. ఏం చేశారు?

Gautam Adani | ఎఫ్‌పీఓ ఉపసంహరణపై గౌతమ్‌ అదానీ కీలక ప్రకటన.. షాక్‌లో పెట్టుబడి దారులు

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Exit mobile version