Home Latest News ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో అశ్విన్‌.. ఏడు స్థానాలు ఎగబాకిన విరాట్‌ కోహ్లీ

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో అశ్విన్‌.. ఏడు స్థానాలు ఎగబాకిన విరాట్‌ కోహ్లీ

ICC Rankings | టైమ్‌ 2 న్యూస్‌, దుబాయ్‌: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో సత్తాచాటిన అశ్విన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ టాప్‌లో నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 25 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు గెలుచుకున్నాడు. అహ్మదాబాద్‌ టెస్టు ప్రదర్శనతో 10 రేటింగ్‌ పాయింట్లు ఖాతాలో వేసుకున్న అశ్విన్‌.. 869 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. గత వారం అశ్విన్‌తో కలిసి టాప్‌లో ఉన్న జేమ్స్‌ అండర్సన్‌ (859 పాయింట్లు) ప్రస్తుతం రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టాప్‌-10లో అశ్విన్‌తో పాటు భారత్‌న ఉంచి జస్ప్రీత్‌ బుమ్రా (7వ ర్యాంక్‌), రవీంద్ర జడేజా (9వ ర్యాంక్‌) మాత్రమే ఉన్నారు.

ఏడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ..

మూడున్నరేండ్ల తర్వాత టెస్టు ఫార్మాట్‌లో సెంచరీ చేసిన భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరాడు. అహ్మదాబాద్‌ టెస్టులో భారీ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక అదే మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 17 స్థానాలు మెరుగుపర్చుకొని 46వ ర్యాంక్‌కు చేరాడు. రోడ్డుప్రమాదానికి గురై.. ప్రస్తుతం కోలుకుంటున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ (766 పాయింట్లు) టీమిండియా తరఫున అత్యుత్తమంగా తొమ్మిదో స్థానంలో ఉండగా.. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (739 పాయింట్లు) పదో ర్యాంక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ (915 పాయింట్లు) టాప్‌లో ఉండగా.. స్టీవ్‌ స్మిత్‌ (872 పాయింట్లు), జో రూట్‌ (871 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.

ఆల్‌రౌండర్లలో మనవాళ్లే..

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో సత్తాచాటిన భారత ఆల్‌రౌండర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపారు. నాలుగు మ్యాచ్‌ల్లోనూ అటు బ్యాట్‌తో ఇటు బంతితో ఆకట్టుకున్న జడేజా 431 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. మరో స్పిన్నర్‌ అశ్విన్‌ (359 పాయింట్లు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. యువ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (316 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు.

రెండో ర్యాంక్‌లోనే భారత్‌..

ఈ సిరీస్‌ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ( డబ్ల్యూటీసీ ) ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాలనుకున్న టీమిండియాకు ఆ చాన్స్‌ దక్కలేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్‌ సేన 2-1తో గెలుచుకోగా.. శ్రీలంకపై తొలి టెస్టులో న్యూజిలాండ్‌ గెలుపొందడంతో డబ్లూ్యటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. చివరి టెస్టు ‘డ్రా’ కావడంతో తాజా ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ (119 పాయింట్లు) రెండో స్థానానికే పరిమితమైంది. సిరీస్‌ కోల్పోయినా.. ఆస్ట్రేలియా 122 పాయింట్లతో టాప్‌లో ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Virat Kohli | ఆ భావనే నన్ను తినేసింది.. అంచనాల భారంతో సమస్యలు పెంచుకున్నా.. విరాట్‌ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Hardik Pandya | ఈ మ్యాచ్‌ నెగ్గితే అతడే భావి భారత సారథి.. హార్దిక్‌ పాండ్యాపై ప్రశంసలు కురిపించిన సునీల్‌ గవాస్కర్‌

Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

IND vs AUS | బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మనదే.. ‘డ్రా’గా ముగిసిన చివరి టెస్టు.. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు

Exit mobile version