Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentTata Play Binge | 199 రూపాయలకే 18 ఓటీటీలు.. డిస్నీ, సోనీ లివ్, జీ5...

Tata Play Binge | 199 రూపాయలకే 18 ఓటీటీలు.. డిస్నీ, సోనీ లివ్, జీ5 కూడా!

Tata Play Binge | కరోనా తర్వాత ఓటీటీలకు డిమాండ్ భారీగా పెరిగింది. కొత్త సినిమాలు రిలీజైన వారంలోనే స్ట్రీమింగ్‌కు రావడంతో పాటు ప్రత్యేకంగా వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అపరిమిత వీడియో కంటెంట్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడమే ఇప్పుడు సమస్యగా మారింది. ఒక్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ కావాలంటే ఒక్కో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి రావడంతో ఆడియన్స్ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే టాటా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 18 ఓటీటీల్లోని కంటెంట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.

18 ఓటీటీల కంటెంట్‌ను వీక్షించేందుకు టాటా ప్లే బింజ్ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన యాప్ కూడా ప్రేక్షకుల కోసం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంచింది. అంతేకాదు టాటా ప్లే డీటీహెచ్ యూజర్లకు కూడా ఈ బింజ్ సర్వీస్ అందిస్తోంది. ఈ టాటా బింజ్ సర్వీస్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్, జీ5, సోనీ లివ్, Eros Now, హంగామా ప్లే సహా మొత్తం 18కి పైగా ఓటీటీల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. అది కూడా కేవలం రూ.199కి మాత్రమే. రూ199 చెల్లించడం ద్వారా నెలంతా 18 ఓటీటీల కంటెంట్‌ను అపరిమితంగా వీక్షించవచ్చు.

నెలవారీ ప్లాన్‌తో పాటు మూడు నెలలు, వార్షిక సబ్‌స్క్రిప్షన్లను కూడా టాటా బింజ్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు నెలల ప్లాన్ కోసం రూ.569, ఏడాది ప్లాన్ కోసం రూ.2189 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ప్లాన్‌‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను మొబైల్‌లో మాత్రమే చూసేందుకు వీలుంటుంది. సన్‌నెక్ట్స్‌ను.. ఎఫ్‌టీవీ, బింజ్ ప్లస్‌లో మాత్రమే వీక్షించొచ్చు. దీంతో పాటు సూపర్, మెగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను కూడా టాటా ప్లే బింజ్ అందిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News