Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalChina | పెళ్లి చేసుకోకున్నా సరే పిల్లల్ని కనండి.. అన్ని బెనిఫిట్స్ ఇస్తామని ప్రోత్సహిస్తున్న చైనా

China | పెళ్లి చేసుకోకున్నా సరే పిల్లల్ని కనండి.. అన్ని బెనిఫిట్స్ ఇస్తామని ప్రోత్సహిస్తున్న చైనా

China | మీకు పెళ్లి కాలేదా.. నో ప్రాబ్లెం.. అయినా సరే పిల్లల్ని కనండి.. ఒకర్ని కాకపోతే పది మందిని కనండి.. మాకేం అభ్యంతరం లేదు. గవర్నమెంట్ నుంచి అందాల్సిన బెనిఫిట్స్ అన్నీ అందిస్తాం.. ఇదీ చైనా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ! పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే వివాహితులు పొందే అన్ని ప్రయోజనాలు అందజేస్తామని వెల్లడించింది. కొత్తగా జననాలు తగ్గి.. వృద్ధులు పెరిగిపోతుండటంతో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

చైనాలో జనాభా తగ్గుదల కలవరపెడుతోంది. ఒకప్పుడు జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. దీంతో పాటు పలు కఠిన నిర్ణయాలను అమలు చేసింది. దీంతో చైనా జనాభా అదుపులోకి వచ్చింది. కానీ అదే ఇప్పుడు కొత్త సమస్యను తీసుకొచ్చింది. ఈ పాలసీకి అలవాటైన చాలామంది ఒక సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే పిల్లల్ని కనేందుకు కూడా ఇష్టపడటం లేదు. పెళ్లిళ్లు కూడా చేసుకోవట్లేదు. దీంతో జనాభా రేటు దారుణంగా పడిపోయింది. కొత్త జననాలు లేకపోవడంతో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువయ్యారు. అలా ముసలివాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నైరుతీలో ఉన్న సిచువాన్ ప్రావిన్స్ ఐదో స్థానంలో ఉంది. దీంతో కొత్త జననాలను ప్రోత్సహించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. గతంలో వివాహితులు మాత్రమే పిల్లల్ని కనాలని.. అది కూడా ఒక్కరినే కనాలనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు అవివాహితులు కూడా సంతానాన్ని పొందేందుకు అనుమతిని ఇచ్చింది ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. అప్పట్నుంచి పెళ్లయిన వాళ్లే కాదు.. పెళ్లి కాని వాళ్లు కూడా అధికారుల దగ్గర పేర్లు నమోదు చేయించుకుని ఎంతమందిని కావాలంటే అంతమంది పిల్లల్ని కనవచ్చని స్పష్టం చేసింది.

జనాభాను పెంచేందుకు మరిన్ని ప్రోత్సాహకాలను కూడా సిచువాన్ ప్రభుత్వం ప్రకటించింది. వైద్య బిల్లులు కవర్ అయ్యేలా ప్రసూతి బీమా, ప్రసూతి సెలవుల సమయంలో జీతం అందించేలా వెసులుబాటు కల్పించింది. ఇది పెళ్లికాని మహిళలు, పురుషులు ఇద్దరికీ వర్తిస్తాయని పేర్కొంది. దీర్ఘకాలికంగా జనాభా సమతుల్యతను కాపాడే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సిచువాన్ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TS Budget | గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పడంతో తొలగిన ప్రతిష్టంభన.. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు

AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

Dharmapuri Arvind | సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News