Wednesday, May 22, 2024
- Advertisment -
HomeLatest NewsDharmapuri Arvind | సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెన్సేషనల్...

Dharmapuri Arvind | సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్

Dharmapuri Arvind | తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందూరుకు కేటీఆర్ ఎందుకు వచ్చారు? కేసీఆర్, కేటీఆర్ నిజామాబాద్‌కు చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. ఏమైనా అంటే పసుపు బోర్డు అని అడుగుతారు.. దానికంటే మెరుగైన బోర్డు, ఇతర వ్యవస్థలు వచ్చాయని చాలాసార్లు చెప్పానని తెలిపారు. కేటీఆర్ నీ దొరతనాన్ని .. బిడ్డా తోలు ఒలుస్తం.. రానున్న రోజుల్లో నీ దొరతనాన్ని, దొరను రోడ్డు మీదకు తీసుకొచ్చి తరిమికొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెద్ద మనిషి కొడుకును అని నన్ను ఏమనడు అంట. సమాజానికి తెలుసు మా అయ్య పెద్ద మనిషి అని.. ఆ మాట నేను అనలేను. ఎందుకు ఇడిచిపెట్టవు.. నేనేమైనా నీ చెల్లె లెక్క బంగారం దొంగతనం చేసిన్నా.. లిక్కర్ స్కాంలు చేసిన్నా.. కమిషన్లు మింగిన్నా.. ఏం చేసినా.. నీ లెక్క మనీలాండరింగ్ చేసిన్నా.. నీ లెక్క డ్రగ్స్ దందా చేసిన్నా.. మీ లెక్క, మీ నాన్న, చెల్లె, బావ లెక్క సమాజాన్ని దోచుకున్నమా? ఏం చేసిన అని వదలవు? అని మంత్రి కేటీఆర్‌ను ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.

పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల్లో అత్యధిక సొమ్ము కేంద్రానిదే ఉందని ధర్మపురి అర్వింద్ తెలిపారు. తెలంగాణ విద్య, వైద్యం, వ్యవసాయం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక్క రిక్రూట్‌మెంట్ కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో 30 శాతం కమిషన్లు తిన్నారని నిజామాబాద్ ఎంపీ ఆరోపించారు. అందుకే డీపీఆర్ ( డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ) ఇవ్వడం లేదని విమర్శించారు. డీపీఆర్ పట్టుకుని వస్తే జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చేనేత కార్మికులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వేస్తుందని విమర్శిస్తున్నారని గుర్తు చేసిన ఆయన.. ఒక పరిమిత టర్నోవర్ దాటిన తర్వాతనే జీఎస్టీ వేస్తున్నట్టు పేర్కొన్నారు. చేనేతలపై అంతగానం ప్రేమ ఉంటే జీఎస్టీలో రాష్ట్ర వాటా కట్ చేసుకుని సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే అదే చేనేత సోదరులతో సిరిసిల్ల రోడ్ల మీద రాజకీయ చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Boris Johnson | మిస్సైల్‌తో దాడి చేసి చంపేస్తానని నన్ను పుతిన్‌ బెదిరించారు…బ్రిటన్‌ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Jaishankar | అది నిన్న జరిగింది కాదు 1962లోనే.. రాహుల్ గాంధీపై జైశంకర్ ఆగ్రహం

America-China War | రెండేళ్లలో అమెరికా, చైనా మధ్య యుద్ధం.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ సంచలన వ్యాఖ్యలు!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News