Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsTS Budget | గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పడంతో తొలగిన ప్రతిష్టంభన.. బడ్జెట్ సమావేశాల తేదీలు...

TS Budget | గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పడంతో తొలగిన ప్రతిష్టంభన.. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు

TS Budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై ఏర్పడిన సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. హైకోర్టు సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ రాజీకొచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడంతో.. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ సుముఖత చూపించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 3న గవర్నర్ తమిళిసై ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 6 రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.

తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు మధ్య కొంతకాలంగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. అధికార పార్టీ నేతలు గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. గవర్నర్ ఏమో అధికార పార్టీ పనితీరును విమర్శిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రిపబ్లిక్ డే వేడుకలను అధికారికంగా నిర్ణయించడంలోనూ వివాదం ఏర్పడింది. దీంతో రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. ఆ వివాదం అలాగే కంటిన్యూ అవుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వరకు వచ్చింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావించింది. దీంతో బడ్జెట్ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో పెట్టారు.

బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ తరఫు న్యాయవాదులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇద్దరూ కలిసి ఓ పరిష్కారానికి వచ్చారు. రాజ్యాంగబద్దంగానే బడ్జెట్ సమావేశాలను జరుపుకుంటామని ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే న్యాయస్థానానికి తెలిపారు. అలాగే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించనున్నట్టు రాజ్ భవన్ న్యాయవాది ఆశోక్ ఆనంద్ హైకోర్టుకు తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగిసింది.

బడ్జెట్ సమావేశాలపై ఏర్పడిన సందిగ్ధత తొలగడంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. అసెంబ్లీ ప్రోరోగ్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం బడ్జెట్ సమావేశాల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

Dharmapuri Arvind | సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News