Home Latest News Sankranti Effect | సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్న జనాలు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా...

Sankranti Effect | సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్న జనాలు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు

Sankranti Effect | తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి సెలవులు కావడంతో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఒకే సమయంలో వేలాది వాహనాలు తరలిరావడంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఫాస్టాగ్ విధానం అమల్లో ఉన్నప్పటికీ అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.

వాహనాల రద్దీని ముందుగానే దృష్టిలో ఉంచుకున్న అధికారులు ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. టూల్ బూత్‌ల్లో రెండు సెకన్ల వ్యవధిలోనే వాహనాలు వెళ్లే ఏర్పాట్లు చేశారు. అయినపన్పటికీ కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనివల్ల టోల్ ప్లాజా దగ్గర వాహనాలు నిలిచిపోతున్నాయని నిర్వహకులు, పోలీస్ సిబ్బంది చెబుతున్నారు.

సంక్రాంతి పండుగకు వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. విజయవాడ హైవేపై యాక్సిడెంట్ స్పాట్లు గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు హైవేపై గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. పంతంగితో పాటు కొర్లపాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Breaking News | షిర్డీ వెళ్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది సాయిబాబా భక్తులు దుర్మరణం

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

Exit mobile version