Home Business Indian Economy | 50 శాతం వాటా ఇండియా, చైనాదే అవుతోంది.. ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు

Indian Economy | 50 శాతం వాటా ఇండియా, చైనాదే అవుతోంది.. ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు

Image Source: IMFlive twitter

Indian Economy | వచ్చే ఆర్థిక సంవత్సరం లో భారత ఆర్థిక వృద్ధి కాస్త నెమ్మదించవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌ ) అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న క్రమంలో కీలక విషయాలను వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక ఔట్‌ లుక్‌కు సంబంధించిన జనవరి అప్‌డేట్‌ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని తెలిపింది. అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం 6.1 కి పరిమితమవుతుందని వెల్లడించింది.

ఈ సమయంలోనే ప్రపంచ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా నమోదవుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2.9 శాతానికి పడిపోతుందని వివరించింది. అది 2024లో పెరిగి… 3.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

భారతదేశంలో అక్టోబర్ ఔట్‌ లుక్‌తో పోలిస్తే… అంచనాలేమీ మారలేదు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది భారత వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు అని చీఫ్‌ ఎకానమిస్ట్ , ఐఎంఎఫ్‌ రీసెర్చ్‌ డిపార్ట్ మెంట్‌ డైరెక్టర్‌ పియర్రీ ఒలీవియర్‌ గౌరించస్ పేర్కొన్నారు.

2023 లో ప్రపంచ వృద్ధిలో 50 శాతం వాటా మొత్తంగా చైనా, ఇండియాదే అని చెప్పారు. అమెరికా, యూరప్ ప్రాంతాలు కలిపి కేవలం 10 శాతం వృద్ధికి మాత్రమే దోహదపడుతాయని వెల్లడించారు. ఈ ఏడాది చైనా ఆర్థిక వృద్ధి 5.2 శాతానికి పెరుగుతుందని, 2024లో మాత్రం 4.5 శాతానికి కుదేలవుతుందని అంచనా వేసింది. ఇక అమెరికా గ్రోత్‌ 1.4 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్‌ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Microsoft Layoffs | ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్.. 11 వేల మంది ఉద్యోగులపై వేటు!

Oxfam Report | అదానీ నాలుగేళ్ల సంపాదనపై పన్ను విధిస్తే.. 50 లక్షల మంది టీచర్లకు జీతాలివ్వొచ్చట.. ఆక్స్‌ఫామ్ నివేదిక

Exit mobile version