Home Latest News Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ అరి నా సబలెంకా కొత్త చరిత్రను రాసింది. మెల్ బోర్న్ లో శనివారం జరిగిన ఫైనల్లో సబలెంకా 4-6,6-3, 6-4 తో 22 వ సీడ్ ఎలెనా రైబాకినా పై విజయం సాధించింది.

తొలి సెట్ లో ఓటమి పాలైనప్పటికీ… ఆ తరువాత వరుసగా రెండు సెట్లు తన పరం చేసుకున్న సబలెంకా తన కెరీర్ లోనే ఓ గొప్ప విజయాన్ని సాధించింది. మొదటి సెట్ ను గెలిచినప్పటికీ, ఆ తరువాత ఆ ఊపు చూపలేకపోయింది కజికిస్థాన్ అమ్మాయి 23 ఏళ్ల రైబాకినా రన్నరప్గా సరిపెట్టుకుంది.

విన్నర్గా నిలిచిన సబలెంకాకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ ఓపెన్ టైటిల్ గెలవడంతో సబలెంకా ప్రపంచ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకుంది.

భారత అత్యుత్తమ మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జనవరి 27 న జరిగిన రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమి చవిచూసింది. తన 18 ఏళ్ల కెరీర్ ను ఓటమితో ముగించింది. దుబాయ్ లో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీ తరువాత ప్రొఫెషనల్ టెన్నిస్ కు రిటైర్మెంట్ ఇస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version