Home Latest News Dresscode | నగలు, మేకప్, జీన్స్‌ వేసుకుని ఆసుపత్రికి రావొద్దు.. హర్యానా ప్రభుత్వం కొత్త నిబంధన

Dresscode | నగలు, మేకప్, జీన్స్‌ వేసుకుని ఆసుపత్రికి రావొద్దు.. హర్యానా ప్రభుత్వం కొత్త నిబంధన

Dresscode | ఇక నుంచి ఆస్పత్రికి ఎలా పడితే అలా రావొద్దు.. జీన్స్‌, పలాజో ప్యాంట్లు, బ్యాక్‌లెస్‌ టాప్స్‌, స్కర్ట్స్‌ అస్సలు వేసుకోవద్దు.. అలా వేసుకుంటే హాస్పిటల్‌లోకి నో పర్మిషన్‌. ఇదీ హర్యానా ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం. రోగులు, డాక్టర్లకు మధ్య తేడా తెలుసుకోవడం కోసం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లేడీ డాక్టర్లు నగలు, మేకప్‌, డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు డాక్టర్లకు డ్రెస్‌ కోడ్‌ ప్రవేశపెట్టింది.

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ డ్రెస్‌ కోడ్‌ ప్రకారం డాక్టర్లు మోడ్రన్ హెయిర్ కట్, విచిత్ర స్టయిల్స్, టీషర్టులు, జీన్స్ , లెదర్ ప్యాంట్లు, నడుము వరకు ఉండే టాప్ లు, స్నీకర్స్ , స్లిప్పర్స్ కూడా ధరించకూడదు. ప్రతి ఒక్క సిబ్బంది తమ గోళ్లను పొడవుగా పెంచకూడదు. ప్రొఫెషనల్ గా కనిపించే ఫార్మల్ దుస్తులనే ధరించాలి. నర్సింగ్ క్యాడర్ కు సంబంధించిన ట్రైనీలు నల్ల ప్యాంట్, వైట్ షర్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ , సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్ కోడ్ తీసుకొచ్చినట్టు హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు.

ఈ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మంత్రి వెల్లడించారు. నైట్ షిప్టులు, వీకెండ్స్‌లో కూడా డ్రెస్ కోడ్ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. ఒక వేళ ఈ నియమాలు పాటించక పోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. డ్రెస్ కోడ్ పాటించని సిబ్బందిని ఆ రోజు గైర్హాజరుగా పరిగణిస్తామన్నారు. హాస్పిటల్ సిబ్బంది కూడా పేరు ఉండే ట్యాగ్ ను ధరించాలన్నారు. ఈ కోడ్ సెక్యూరిటీ, డ్రైవర్లు, శానిటైజ్ సిబ్బంది, కిచెన్ వర్కర్స్ కూడా వర్తించనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Single man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అసలు సమస్య ఏంటో తెలిసి షాక్ !

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Exit mobile version