Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు ( 25-12-2022 )

Horoscope Today | రాశిఫలాలు ( 25-12-2022 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితికి అనుకూలం.

వృషభం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మిథునం

భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. వాహన, గృహ యోగాలు పొందుతారు.

కర్కాటకం

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

సింహం

ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.

కన్య

కుటుంబంలో ఏర్పడిన చికాకులు పరిష్కరించుకుంటారు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి.

తుల

కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆస్తిలాభం పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తు సేకరణ సూచన.

వృశ్చికం

పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. జీవిత భాగస్వామి సూచనతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ధనుస్సు

రుణ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగాల్లో స్థాన మార్పిడులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదొడుకులు ఎదురైనా సన్నిహితులు సాయం అందిస్తారు. సోదరులనుంచి ధనలాభం ఉంటుంది.

మకరం

పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనలాభ సూచన కలదు.

కుంభం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి నూతన ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్నికలుగజేస్తారు. వాహన సౌఖ్యం ఉంది.

మీనం

సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Christmas celebrations | క్రిస్మస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎలా జరుపుకుంటారు?

New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు పెట్టకండి

Exit mobile version