Home News AP Vande Bharat Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. సికింద్రాబాద్-విశాఖ...

Vande Bharat Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడవనున్న రైలు

Image Source: Kishan Reddy Gangapuram Facebook

Vande Bharat Express | సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన బుకింగ్స్‌ను రైల్వే శాఖ ఓపెన్ చేసింది. శనివారం నుంచి టికెట్లను అందుబాటులో ఉంచింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు టికెట్ ధరలను, ట్రైన్ టైం టేబుల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు ఏడు వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా… ఇది ఎనిమిదో రైలు. ఈ ట్రైన్ లోని ఏసీ,నాన్ ఏసీ బోగీలలో కలిపి మొత్తం 1,128 మంది ప్రయాణించవచ్చని తెలిపింది. వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య పరుగులు పెడుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vande Bharat Express | సికింద్రాబాద్ టూ విశాఖ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ధరలు, టైం టేబుల్ వివరాలివే !!

Womens T20 World Cup | అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ .. జట్టులో భద్రాచలం అమ్మాయి

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

Exit mobile version