Home Latest News Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా...

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

Image Source: pixabay

Rajashree Swain | ఒడిశా రాష్ట్రంలో ఓ యువ మహిళా క్రికెటర్ మృతి అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ నగరానికి సమీపంలో దట్టమైన అడవిలో చెట్టుకు వేలాడుతున్న ఓ యువతి మృతదేహన్ని కనుగొన్నారు. అది ఓ యువ మహిళా క్రికెటర్‌ రాజశ్రీ స్వైన్‌ దిగా గుర్తించారు. గత రెండు రోజులుగా ఆమె కనిపించడం లేదని ఆమె కోచ్‌ ఈ సిటీలోని మంగళ్‌ బాగ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అడవిలో ఆమె మృతదేహం కనపడడంతో షాక్‌ తిన్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లుగా పోలీసులు తెలిపారు. ఆమెది అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అడవికి దగ్గరలో ఓ స్కూటర్ కనిపించిందని, ఆమె మొబైల్‌ కూడా అక్కడే పడిఉందని , అది పూర్తిగా ఆగిపోయిందని అన్నారు.

కుటుంబ సభ్యుల వాదన మరోలా !

ఇదిలా ఉంటే రాజశ్రీ ని ఎవరో హత్య చేశారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. పుదుచ్చేరిలో జరుగనున్న జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ కోసం ఒడిశా క్రికెట్ అసోసియేషన్‌… కటక్ లోని ఓ మైదానంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించిందని, స్వైన్ తో బాటు సుమారు 25 మంది క్రికెటర్లు ఈ క్యాంప్ కి హాజరు కావలసి ఉందని తెలిసింది.

కానీ ఈ నెల 10 న ప్రకటించిన ఫైనల్ లిస్ట్ లోస్వైన్ పేరు లేదు.. ఆ మరుసటిరోజున మహిళా క్రికెటర్లంతా ప్రాక్టీస్ కోసం తంగి అనే ఏరియాకు వెళ్లినప్పటికీ .. తన తండ్రిని కలిసేందుకు తాను పూరీకి వెళ్తున్నానని స్వైన్ తన కోచ్ కి చెప్పినట్టు తెలుస్తోంది.

స్వైన్ మృతికి ఆమె కోచ్ పుష్పాంజలి బెనర్జీ, , ఒడిశా క్రికెట్ అసోసియేషన్ కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంతో చలాకీ పిల్ల అయిన స్వైన్ ఆత్మహత్య చేసుకునే పిరికి మనస్తత్వం కలిగినది కాదని, క్రికెట్ లో ఎదుగుతున్న ఆమెను ఎవరో హత్య చేశారనే తాము భావిస్తున్నామని ఆమె తండ్రి అంటున్నారు. పోలీసులు అన్ని కోణాల నుంచి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరో క్రికెటర్ కూడా..

ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్‌ కి చెందిన క్రికెటర్ సిద్ధార్థ్‌ శర్మ అనారోగ్యంతో కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధార్థ్‌ ఆసుపత్రిలో చేరాడు. వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KL Rahul | దేనికైనా రెడీ.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌పై కేఎల్ రాహుల్‌ స్పందన

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో ఈసారైనా భారత్‌ సత్తా చాటుతుందా.. స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌

India Vs Sri Lanka | సిరీస్‌ మనదే.. మెరిసిన మిడిలార్డర్‌.. శ్రీలంకపై భారత్‌ విక్టరీ

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో ఈసారైనా భారత్‌ సత్తా చాటుతుందా.. స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌

Exit mobile version