Home Latest News Kerala Schools | ఇక స్కూళ్లలో సర్‌… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్‌.....

Kerala Schools | ఇక స్కూళ్లలో సర్‌… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్‌.. ఆదేశాలు జారీ !

Image Source: Pixabay

Kerala Schools | సాధారణంగా స్కూల్స్ లో ఉపాధ్యాయుడిని సర్ అని, ఉపాధ్యాయురాలిని మేడమ్‌ అని విద్యార్థులు పిలుస్తూంటారు. అయితే కేరళలో ఇక మీద అలా పిలవడానికి వీలు లేదని ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

ఉపాధ్యాయుడైనా, ఉపాధ్యాయిని అయినా సరే టీచర్ అని పిలిస్తే చాలని పేర్కొంది. అంతేకాకుండా టీచర్‌ అనే పదం లింగాన్ని సూచించకుండా ఉంటుందని వివరించింది. ఈ మేరకు ప్యానెల్‌ ఛైర్‌ పర్సన్‌ కేవీ మనోజ్‌ కుమార్‌, సభ్యుడు విజయ్‌ కుమార్‌ తో కూడిన ఆ కమిషన్‌ బెంచ్‌ సాధారణ విద్యాశాఖకు సూచనలు ఇచ్చింది.

అన్ని పాఠశాలలు వెంటనే ఈ నియమాలు అమలు జరిగేలా చూడాలని చెప్పింది. సర్‌, మేడమ్‌ అని కాకుండా టీచర్‌ అని పిలిస్తే విద్యార్థుల మధ్య సమానత్వం ఉంటుందని మానవ హక్కుల కమిషన్‌ అభిప్రాయపడింది.

అంతేకాకుండా టీచర్లతో పిల్లలకు ఉండే అనుబంధం మరింత పెరుగుతుందని చెప్పింది. సర్‌, మేడమ్‌ అనడం వల్ల లింగ వివక్ష కొనసాగుతుందని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ ను పరిశీలించిన కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

Weather Report | ఈ శతాబ్దంలో ఇదే అత్యంత చలికాలం.. మరో వారంలో మైనస్ 4 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

Ganga vilas | ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా విలాస్ ఎక్కాలంటే 20 లక్షలు ఉండాల్సిందే.. ఈ క్రూయిజ్ స్పెషాలిటీ ఏంటి?

Breaking News | షిర్డీ వెళ్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది సాయిబాబా భక్తులు దుర్మరణం

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

Exit mobile version