Home Latest News Weather Report | ఈ శతాబ్దంలో ఇదే అత్యంత చలికాలం.. మరో వారంలో మైనస్ 4...

Weather Report | ఈ శతాబ్దంలో ఇదే అత్యంత చలికాలం.. మరో వారంలో మైనస్ 4 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

Weather Report | ఉత్తర భారత దేశాన్ని చలి వణికిస్తోంది. కొద్దిరోజులుగా అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. వచ్చే వారంలో ఇవి మరింత పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిన వచ్చే వారంలో మైనస్ 4 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని తెలిపారు. మరో రెండు రోజుల నుంచి జనవరి 19 వ తేదీ వరకు తీవ్ర శీతలగాలులు వీస్తాయని పేర్కొన్నారు.

జనవరి 16 నుంచి 18 మధ్య అవి తీవ్ర స్థాయికి చేరుకుంటాయని నవదీప్ దహియా ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. 21వ శతాబ్ధిలో ఇదే అత్యంత చలికాలం కాగలదని ఆయన ట్వీట్‌లో తెలిపారు. గత కొన్ని వారాలుగా రాత్రి పూట చలి తీవ్రంగా ఉంటుంది. 23 ఏళ్ల తర్వాత ఇదే అత్యంత చలికాలం అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఇంతకుముందు 2006 లో , 2013లో ఇంతలా చలి ఉందని వాతావరణ నిపుణులు జెనమని తెలిపారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, పశ్చిమ, యూపీ, ఉత్తర రాజస్థాన్‌లో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునైతే నువ్ కల్యాణాల కళ్యాణ్.. పవన్ కళ్యాణ్‌పై అంబటి స్ట్రాంగ్ కౌంటర్

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Exit mobile version