Home Latest News Nawazuddin Siddiqui | అతని కోసం నా లైఫ్‌లో 18 ఏళ్లు వేస్ట్‌ చేశా.. కన్నీళ్లు...

Nawazuddin Siddiqui | అతని కోసం నా లైఫ్‌లో 18 ఏళ్లు వేస్ట్‌ చేశా.. కన్నీళ్లు పెట్టుకున్న నవాజుద్దీన్‌ భార్య ఆలియా

Nawazuddin Siddiqui | బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీకి, అతని భార్య ఆలియాకు మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ మనస్పర్థల కారణంగానే కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నవాజుద్దీన్ సిద్దిఖీపై ఆలియా విపరీతమైన ఆరోపణలు చేస్తోంది. సిద్దిఖీ అనుకున్నంత మంచి వాడు కాదని.. తనను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని… అన్నం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టేవాడని ఆలియా ఆరోపణలు చేసింది.

ఈ క్రమంలో తాజాగా సిద్దిఖీ గురించి ఇంకొన్ని విషయాలు చెబుతూ మరో వీడియోను ఆలియా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ”నేనంటే విలువలేని మనిషి కోసం నా లైఫ్‌లో 18 సంవత్సరాలు కేటాయించినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. 2004 లో మొదటిసారి నవాజ్ ను కలిశాను. అప్పట్లో నేను, నవాజ్, ఆయన సోదరుడు అందరూ కలిసి ఓ చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. దాంతో తను నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మి, జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడని మూర్ఖంగా నమ్మాను. అతన్ని 2010 లో పెళ్లి చేసుకున్నా. పెళ్లయిన ఏడాదికే ఓ బిడ్డకు పుట్టింది. ఆ సమయంలో నా డెలివరీ ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో.. మా అమ్మ ఇచ్చిన ప్లాట్‌ను కూడా అమ్మేశా” అని చెబుతూ వాపోయింది.

ఇక ఆ సమయంలో నవాజ్‌కు ఓ కారు కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఆలియా పేర్కొంది. అయితే అతడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని ఆమె అన్నారు. అతడు పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకునే వాడు కాదని ఆమె ఆరోపించింది. ఇంతకాలం తర్వాత నాపై అతడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. తొలి బిడ్డ పుట్టిన తర్వాత నాకు విడాకులు ఇచ్చేశానని ప్రచారం కూడా చేసినట్లు ఆలియా చెప్పుకొచ్చింది. నవాజ్ మాటలు నన్ను మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టాయని భావోద్వేగానికి లోనైంది ఆలియా.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Single man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అసలు సమస్య ఏంటో తెలిసి షాక్ !

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Exit mobile version