Home Lifestyle Devotional Sabarimala | శబరిమల ప్రసాదంలో రసాయనాలు.. విక్రయాలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం

Sabarimala | శబరిమల ప్రసాదంలో రసాయనాలు.. విక్రయాలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం

Pic Credit: https://sabarimalaonline.org

Sabarimala | శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం ‘అరవణ పాయసాన్ని’ పంపిణీ నిలిపివేయాలని ట్రావెన్ కోర్‌ దేవస్థానం బోర్డుకి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రసాదం తయారీలో వినియోగించే యాలకుల్లో రసాయనాలు ఉన్నట్లు తెలియడంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

దాంతో ప్రసాదంలో యాలకులు లేకుండానే తయారు చేసేందుకు ట్రావెన్ కోర్‌ దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది. గురువారం నుంచి యాలకులను ఉపయోగించకుండా అరవణ పాయసాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించింది.

అసలేం జరిగిందంటే…

శబరిమల ప్రసాదంలో రసాయనాలు ఉన్నట్లు కొందరు భక్తులు ఫిర్యాదులు చేశారు. నాణ్యతను పరీక్షించాలని అధికారులను కోరారు. దాంతో ప్రసాదం శాంపిళ్లను ల్యాబ్ లకు పంపారు అధికారులు. రెండు ల్యాబ్ ల రిపోర్టులు ఇటీవలే వచ్చాయి. అయితే ప్రసాదం లో పరిమితికి మించి రసాయన మందుల ఆనవాళ్లు ఉన్నట్లు ల్యాబ్‌ రిపోర్ట్‌లో తేలింది. వీటిని హైకోర్టు డివిజన్ బెంచ్ పరిశీలించింది. ఇప్పటి వరకు తయారు చేసిన ప్రసాదం పంపిణీని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది.

దీంతో కొంతకాలం పాటు యాలకులు లేకుండానే అరవణ ప్రసాదాన్ని తయారు చేసి, పంపిణీ చేసేందుకు ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది. గురువారం నుంచి యాలకులు లేకుండా అరవణ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించింది. సేంద్రియ యాలకులను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ టీబీడీ ప్రెసిడెంట్‌ కే అనంతగోపన్ తెలిపారు.

అరవణ ప్రసాద విక్రయం నుంచి ఆలయానికి భారీ ఆదాయం వస్తుంది. బియ్యం, నెయ్యి, యాలకులతో ఈ అరవణ పాయసాన్ని తయారు చేస్తారు. భక్తులు రద్దీ గా ఉన్న సమయంలోనే ప్రసాదం ద్వారానే ఆలయ బోర్డుకు 60 శాతం ఆదాయం వస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Sakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Exit mobile version