Home Entertainment Virat Kohli Daughter | కూతురితో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకున్న విరాట్, అనుష్క శర్మ.....

Virat Kohli Daughter | కూతురితో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకున్న విరాట్, అనుష్క శర్మ.. ఈసారి కూడా అదే ట్విస్ట్

Image Source : Instagram

Virat Kohli Daughter vaamika | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ( virat kohli ), బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ ( Anushka Sharma )ల గారాలపట్టి వామిక పుట్టిన రోజు బుధవారం జరిగింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురుతో సంతోషంగా గడుపుతున్న క్షణాలను చిత్రాల రూపంలో పంచుకుంది. ఈ చిత్రాలలో వామిక అనుష్కకి ముద్దులు పెడుతుండగా ఆమె పెద్దగా నవ్వుతుంది.

అనుష్క శర్మ ఈ చిత్రాలను షేర్ చేస్తున్న రెండు సంవత్సరాల క్రితమే నా హృదయం నీ కోసం తెరుచుకుంది. నీవు పుట్టి మాలో ఎన్నో సంతోషాలను తీసుకుని వచ్చావు అంటూ రాసుకొచ్చింది. వీటిని చూసిన కోహ్లీ హర్ట్‌ ఎమోజీ లతో తన ప్రేమను తెలిపాడు. అలాగే తను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వామికను ఛాతిపై పడుకోబెట్టుకున్న ఫొటోను షేర్ చేశాడు. అయితే ఇద్దరూ కూడా తమ కూతురు మొహం కనిపించకుండా ఈ ఫొటోలను షేర్ చేయడం గమనార్హం.

వామిక చిత్రాల గురించి అటు కోహ్లీ కానీ, ఇటు అనుష్క కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. గతేడాది ఓ మ్యాచ్‌లో వామిక చిత్రాలను తీసి చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విరుష్క జంట తమ కూతురు ఫొటోలను డిలీట్ చేయాలని కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు. హాయ్‌ గైస్‌ స్టేడియంలో మా కుమార్తె కనిపించడంతో ఆ చిత్రాలను నెట్టింట్లో షేర్‌ చేశారని తెలిసింది. మేం ఇంతకు ముందు వివరించిన కారణాల వల్ల వామిక చిత్రాలు క్లిక్ చేయొద్దని కోరుతున్నా. ఒకవేళ పబ్లిష్ చేస్తే మాత్రం డిలీట్‌ చేయండి. ఇప్పటికే వామిక చిత్రాలను డిలీట్ చేసినవారికి ధన్యవాదాలు అంటూ తెలిపారు. దీనిని బట్టి చూస్తే వారు తమ కూతురు వామిక చిత్రాలను అప్పుడే బయట ప్రపంచానికి చూపడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

India Vs Sri Lanka | భారత్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్టులో ఎవరున్నారు?

Gautham Gambhir | శ్రీలంక చెత్త బౌలింగ్‌ వల్లే కోహ్లీ సెంచరీ చేశాడు.. సచిన్‌తో కోహ్లీని పోల్చడంపై గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

ICC ODI Rankings | ఐసీసీ వన్డే ర్యాంకుల్లో దూసుకెళ్లిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. టాప్‌ 10లో బౌలర్లకు దక్కని చోటు

India Vs Srilanka | శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ

Exit mobile version