Home News International Most Expensive school | ఈ స్కూళ్లో కట్టే ఏడాది ఫీజుతో హైదరాబాద్‌లో నాలుగైదు ఇళ్లు...

Most Expensive school | ఈ స్కూళ్లో కట్టే ఏడాది ఫీజుతో హైదరాబాద్‌లో నాలుగైదు ఇళ్లు కొనొచ్చు.. ఏంటా స్కూలు ప్రత్యేకత ?

Image source: Institut Le Rosey website

Most Expensive school | సాధారణంగా స్కూళ్లో ఫీజులు ఎంతుంటాయి? ఒకప్పుడైతే పది, ఇరవై రూపాయలుండే.. రాను రాను ఆ ఫీజులు కాస్తా.. వందలు, వేలు దాటి ఇప్పుడు లక్షల రూపాయలకు చేరాయి. కొన్ని సూళ్లలో అయితే ఎల్‌కేజీ, యూకేజీకే రెండు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు చూస్తుంటే ఏం చదువులు బాబోయ్ అంటూ తల్లిదండ్రులు తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ స్కూల్లో ఒక్క ఏడాది కట్టే ఫీజుతో హైదరాబాద్‌లో నాలుగైదు ఇళ్లు కొనుక్కోవచ్చు. వినడానికి వింతగా ఉన్నా ఈ స్కూలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. ఏంటా స్కూలు, దాని విశేషాలేంటో ఓ సారి లుక్కేయండి మరి..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ స్కూలు స్విట్జర్లాండ్‌లోని రోల్‌లో ఉంది. దాని పేరు ఇన్‌స్టిట్యూట్ లె రోజీ. ఈ బోర్డింగ్ స్కూల్లో ఏడాదికి ఫీజు దాదాపు రూ.10 కోట్లు. ఇందులో ట్యూషన్ ఫీజే కోటికి పైగా ఉంటుంది. ఇంతగా ఫీజులు ఎందుకు ఉన్నాయని ఆలోచిస్తున్నారా? దీనికో ప్రత్యేకత ఉంది. 70 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్కూలుకు 140 ఏండ్ల చరిత్ర ఉంది. దీన్ని రాజుల పాఠశాలగానూ పిలుస్తుంటారట. ఎందుకంటే ఇక్కడ చదువుకునే వాళ్లంతా వివిధ దేశాల యువరాజులు, బిలియనీర్లు, నటీనటుల సంతానమే.

ఏ స్కూల్లో అయినా ఒకటి నుంచి పదో తరగతి వరకు క్లాసులుంటాయి. కానీ ఇక్కడ మాత్రం జూనియర్, క్యాడెట్, జన్ సీనియర్, సీనియర్లు అనే గ్రేడులు ఉంటాయి. ఈ నాలుగు విభాగాల్లో దాదాపు 420 మంది చదువుకుంటారు. ప్రతి పది మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటారు. ఈ స్కూళ్లో అందరికీ ఒకేరకమైన పుస్తకాలు ఉండవు. పుస్తకాలతో కుస్తీలాట ఉండదు. జూనియర్లకు తోటల పెంపకం, పర్యావరణం, రోజూవారీ ఆహారం ఎలా వస్తుందనే విషయాలు నేర్పిస్తారు. గ్రేడ్లు పెరిగినా కొద్ది మ్యాథ్స్, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టులతో పాటు వివిధ భాషలు నేర్చుకునేలా శిక్షణ ఇస్తారు. ఇక్కడ ప్రతి వారం పాఠ్యాంశాలతో పాటు చెప్పే విధానం ఎప్పటికప్పుడు మారిపోతుంటుందట.

ఇక్కడ చదివే విద్యార్థులు నచ్చిన ఆటలు నేర్చుకోవచ్చు. సంగతం, డ్యాన్సులు, డైరెక్షన్, గుర్రపుస్వారీ, సెయిలింగ్ ఇలా తమకు నచ్చిన వాటిని నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి స్కూల్లో ఉండే లైబ్రరీలో దాదాపు 20 ప్రముఖ భాషలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. నచ్చన భాషను నేర్చుకుని చదువుకోవచ్చు.

ఇక్కడ కేవలం చదువే కాదు నలుగురిలో ఎలా ఉండాలనే విషయాలను ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు. ఇక్కడి హాస్టళ్లలో గదికి ఇద్దరే ఉంటారు. వాళ్లు కూడా ఏడాదికి మూడుసార్లు మారుతుంటారు. ఎందుకంటే నలుగురితో కలిసిపోయేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అలా చేస్తారు. ఇక్కడ వంటపనులు, భోజన శాలలో సాయం చేయడం అందరూ చేయాల్సిందే. షాపింగ్ వెళ్లాలనుకుంటే వారాంతాల్లో టీచర్లతో కలిసి ఎంచక్కా వెళ్లిపోవచ్చు. ప్రతి విద్యార్థికి పాకెట్ మనీని పాఠశాల యాజమాన్యమే ఇస్తుంది. ఇందులో చదివే విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా.. దానికి తగ్గట్టుగా టీచర్లు శిక్షణ ఇస్తారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Exit mobile version