Home Entertainment Raviteja | రవితేజ కొడుకు హీరోగా రాబోతున్నాడా.. ఇడియట్2పై మాస్ మహారాజా క్లారిటీ ఇదీ

Raviteja | రవితేజ కొడుకు హీరోగా రాబోతున్నాడా.. ఇడియట్2పై మాస్ మహారాజా క్లారిటీ ఇదీ

Photo Credit : Facebook/raviteja

Raviteja | ఇండస్ట్రీలో వారసులు రావడం కామన్. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ దాకా ఇది జరుగుతూనే ఉంది. తమ అభిమాన హీరోల వారసులు సినిమాల్లోకి ఎప్పుడు వస్తారా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ గురించి నందమూరి అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ భూపతి రాజు సినిమాల్లోకి రాబోతున్నాడనే వార్త టాలీవుడ్‌లో క్రేజీ టాపిక్‌గా మారింది.

ధమాకా సక్సెస్‌తో మాస్ మహారాజా దూసుకెళ్తున్నాడు. తొందరలోనే మెగాస్టార్ రవితేజ హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతికి మరోసారి పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో మహాధన్ సినిమాల్లోకి రావడంపై రవితేజకు ఓ ప్రశ్న ఎదురైంది. మీ అబ్బాయిని వచ్చే ఏడాది ఇడియట్ 2 సినిమాతో హీరోగా పరిచయం చేయబోతున్నారని అందరూ అనుకుంటున్నారు అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన మాస్ మహారాజా.. అవన్నీ వట్టి పుకార్లేనని ఖండించాడు. ఈ గాసిప్ వినడం ఇదే మొదటిసారి అని.. ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏవీ లేవని క్లారిటీ ఇచ్చాడు.

రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ కొడుకు మహాధన్ బాలనటుడిగా నటించాడు. అందులో రవితేజ చిన్ననాటి పాత్రను పోషించాడు. ప్రస్తుతం మహాధన్ చదువుకుంటున్నాడు. అలాగే నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడని సమాచారం. అమెరికా వెళ్లి నటనలో డిప్లొమా, డ్యాన్స్, ఫైట్స్‌లో కూడా శిక్షణ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Anupama Parameswaran | అమ్మో అనుపమ రెమ్యునరేషన్‌ ఒక్కసారిగా అంత పెంచేసిందా?

Prabhas | ప్రభాస్‌, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాపై క్లారిటీ వచ్చేసిందిగా..

Matti Kusthi in Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న మట్టి కుస్తీ.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

Exit mobile version