Home News International Monterey Park | అమెరికాలో మరోసారి కాల్పులు.. 10 మంది మృతి.. చైనా కొత్త సంవత్సర...

Monterey Park | అమెరికాలో మరోసారి కాల్పులు.. 10 మంది మృతి.. చైనా కొత్త సంవత్సర వేడుకల్లో దారుణం

Monterey Park | అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. లాస్‌ఏంజెలిస్‌ సమీపంలోని మాంటేరీ పార్కులో శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మందికి పైగా దుర్మరణం చెందారు.

శనివారం ( జనవరి 21 )న చైనీయులు లూనార్ న్యూఇయర్ సందర్భంగా మాంటేరీ పార్కులో వేడుక నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌కు వేలాది మంది హాజరయ్యారు. ఈ వేడుకల దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి.. విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 10 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన దుండగుడిని ఇంకా పోలీసులు గుర్తించలేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Exit mobile version