Home News International Che guevara | హైదరాబాద్‌కు చే గువేరా కుమార్తె, మనవరాలు.. రవీంద్ర భారతి క్యూబా సంఘీభావ...

Che guevara | హైదరాబాద్‌కు చే గువేరా కుమార్తె, మనవరాలు.. రవీంద్ర భారతి క్యూబా సంఘీభావ సభలో పాల్గొననున్న శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి

Che guevara | క్యూబా విప్లవవీరుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనువరాలు ఎస్తేఫానియా గువేరా హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయానికి వచ్చారు. వీరికి కమ్యూనిస్టు పార్టీల యువజన సంఘాలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా, ఐప్సోల ఆధ్వర్యంలో ఇవాళ ( ఆదివారం ) సాయంత్రం రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావ సభ జరగనుంది. చే గువేరా కుమార్తె అలైదా గువేరా.. ఆమె కుమార్తె ఎస్తేఫానియా గువేరా ఈ కార్యక్రమం కోసమే హైదరాబాద్ వచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఎంఐఎం మినహా మిగతా పార్టీల నేతలు పాల్గొననున్నారు.

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబాకు ప్రపంచదేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా క్యూబాకు మద్దతుగా హైదరాబాద్‌లో క్యూబా సంఘీభావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, టపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీసీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని , మాజీ ఎంపీ మల్లు రవితో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొంటారు. రవీంద్రభారతి సభ వద్ద చే గువేరాకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు భారీగా ఏర్పాటు చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Trisha | విజయ్ ఇంటికి సమీపంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్న త్రిష

Exit mobile version