Home Entertainment Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్...

Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో

Kartik Aaryan | బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ముందు వరుసలో ఉంటాడు. ఈయన నటించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న తరుణంలో కూడా భూల్ భూలయ్యా 2 సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. #boycottbollywood ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్‌లో కూడా హిట్ కొట్టి సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. తాజాగా షెహజాదా సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాకు ఇది రీమేక్‌గా వస్తుంది. ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ కొట్టాలని చూస్తున్న కార్తిక్ ఆర్యన్ గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్‌గా మారింది.

ప్యార్ కా పంచనామా చిత్రంతో కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం రూ.1.75 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అలాంటి కార్తిక్ ఆర్యన్.. భూల్ భూలయ్య 2 సినిమా కోసం ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నాడట. అది కూడా కేవలం 10 రోజుల కోసం మాత్రమే. ఈ న్యూస్ ఇప్పుడు బీటౌన్‌లో వైరల్‌గా మారింది. 10 రోజుల డేట్స్ కోసమే కార్తిక్ ఆర్యన్‌ రూ.20 కోట్ల పారితోషికం తీసుకున్నాడా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ యంగ్ హీరోకు అంత డిమాండ్ ఏంటి అని అంతా షాకైపోతున్నారు. ఈ వార్త వైరల్‌గా మారడంతో కార్తిక్ ఆర్యన్ స్పందించాడు. ఈ వార్త నిజమేనని క్లారిటీ ఇచ్చాడు.

భూల్ భూలయ్య 2 సినిమా కోసం రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మాట నిజమేనని కార్తిక్ ఆర్యన్ అంగీకరించాడు. కొవిడ్ సమయం కాబట్టి కేవలం 10 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశానని చెప్పుకొచ్చాడు. తొందరగా సినిమా కంప్లీట్ కావడంతో నిర్మాతలకు కూడా బాగానే లాభం వచ్చింది. కాబట్టి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని సమర్థించుకున్నాడు. వైవిధ్యమైన కథల్లో నటించి ప్రేక్షకులను అలరించేందుకు కష్టపడతానని చెప్పాడు. తన కష్టాన్ని చూస్తున్నారు కాబట్టే ఆడియన్స్ అంతలా తనను ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Exit mobile version