Home Entertainment mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి...

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

mahanati savitri | డబ్బులు ఊరికే రావు అనే ఒకే ఒక్క డైలాగుతో ఎంతగానో పాపులర్ అయ్యాడు లలితా జ్యువెల్లరీ ( Lalithaa jewellery ) ఎండీ కిరణ్ కుమార్ ( Kiran kumar ). ఆ ఒక్క యాడ్‌ తెచ్చిన క్రేజ్‌తో తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఎక్కడో చిన్నగా బంగారు దుకాణం పెట్టి.. జ్యువెల్లరీ బిజినెస్‌లో కోట్లాది రూపాయలను సంపాదించాడు. ఈ బిజినెస్‌లో కిరణ్ కుమార్ అంతలా సక్సెస్ కావడానికి.. మహానటి సావిత్రికి సంబంధం ఉందని మీకు తెలుసా ! అవునా.. అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. ఈ విషయాన్ని లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్ కుమార్ స్వయంగా వెల్లడించారు.

చెన్నైలోని సావిత్రి ఇంటిని పడగొట్టి ఆమె పిల్లలు ఓ కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకుని కిరణ్ కుమార్ తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆ బిల్డింగ్‌లో తనకు కలిసివచ్చి సక్సెస్ అయ్యాడు. దీంతో సావిత్రి బిల్డింగ్‌ను సెంటిమెంట్‌గా భావించాడు. సావిత్రి వారసులు ఆ బిల్డింగ్‌ను అమ్ముదామని అనుకున్నప్పుడు తానే కొంటానని ముందుకొచ్చాడు. అలా సావిత్రి ఇంటిని సొంతం చేసుకుని అక్కడే వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఆ బిల్డింగ్‌ను కిరణ్ కుమార్‌కే అమ్మడం వెనుక గల కారణాన్ని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అమ్మ ( సావిత్రి)కి బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్‌ది బంగారం దుకాణమే. అమ్మకు కార్లు అంటే పిచ్చి ఉన్నట్టే.. కిరణ్‌కు కూడా కార్ల పిచ్చి ఉంది. అమ్మను అతను బాగా అభిమానిస్తాడు. తనను తమ్ముడిగా భావించమంటారని.. అక్క అని అప్యాయంగా పిలుస్తారని పేర్కొంది. అందుకే ఆ ఇంటిని కిరణ్‌కే విక్రయించామని విజయ్ చాముండేశ్వరి తెలిపింది.

ఆ బిల్డింగ్ అమ్మినప్పుడు సావిత్రి ఫొటోను తీసుకెళ్తుంటే.. మీరు ఏమైనా తీసుకెళ్లండి.. గానీ సావిత్రమ్మ ఫొటో మాత్రం తీసుకోవద్దమ్మా అని అన్నానని కిరణ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటివరకు కూడా ఆ బిల్డింగ్ పేరు మార్చలేదని చెప్పాడు. బిల్డింగ్‌కు ఉన్న సావిత్రి గణేశన్ పేరు మార్చలేదని.. లలితా కార్పొరేట్ ఆఫీస్ అని రాశామని చెప్పారు. తనకు ఫస్ట్ నుంచి కార్లు అంటే పిచ్చి అని.. తన వద్ద 40 కార్లు ఉన్నాయని తెలిపారు. అవన్నీ కూడా సావిత్రి ఇంట్లోనే ఉన్నాయని చెప్పారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Trisha | విజయ్ ఇంటికి సమీపంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్న త్రిష

Pawan Kalyan | కొండగట్టు అంజన్న మీద పవన్‌ కళ్యాణ్‌కి అంత సెంటిమెంట్‌ ఎందుకు ? వారాహికి అక్కడే పూజలు చేయడానికి కారణమేంటి ?

Exit mobile version