Wednesday, May 15, 2024
- Advertisment -
HomeNewsInternationalMiss Universe 2022 | మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న బొన్నీ గాబ్రియెల్.. 11 ఏళ్ల...

Miss Universe 2022 | మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న బొన్నీ గాబ్రియెల్.. 11 ఏళ్ల తర్వాత అమెరికాకు కిరీటం

Miss Universe 2022 | మిస్ యూనివర్స్ 2022 పోటీల్లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని అమెరికాకు చెందిన ఆర్ బొన్నీ గాబ్రియెల్ ( R’bonney Gabriel ) సొంతం చేసుకుంది. 11 ఏళ్ల తర్వాత అమెరికా మరోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ కిరీటం కోసం ఫైనల్లో వెనిజులాకు చెందిన అమందా దుడామెల్ ( Amanda Dudamel ) తో తలపడింది. చివరకు ఆధిక్యాన్ని సంపాదించి ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మూడో స్థానంలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన అందాల భామ ఆండ్రియానా మార్టినెజ్‌ ( Andreína Martínez ) నిలిచింది. అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌లో మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. భారత్‌కు చెందిన దివితా రాయ్‌తో పాటు 85 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.

గత ఏడాది భారత్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సింధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మరోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది. పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే రెండో రన్నరప్‌గా నిలిచారు. అంతకుముందు 1994లో మిస్ యూనివర్స్‌గా సుస్మితాసేన్, 2000 లో లారా దత్తా మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

భారత్ తరఫున కర్ణాటకకు చెందిన దివితా రాయ్ ( Divita Rai ) ఈసారి మిస్ యూనివర్స్ ( Miss Universe ) పోటీల్లో పాల్గొని 16వ స్థానంలో నిలిచింది. 1998 జనవరి 10న జన్మించిన దివితా.. ముంబైలోని సర్ జేజే కాలేజ్ ఆప్ ఆర్కిటెక్చర్ కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం మోడలింగ్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనమని సలహాలు రావడంతో ఆ దిశగా ప్రయత్నించింది. 2019లో ఫెమీనా ఇండియా పోటీలకు అర్హత సాధించింది. గత ఏడాది ఆగస్టు 28న మిస్ దివా యూనివర్స్ 2022 టైటిల్ గెలుచుకుంది. అంతేకాదు 2021లో మిస్ దివా యూనివర్స్ లో రన్నరప్‌గా నిలిచింది. బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, పెయింటింగ్ అంటే దివితాకు చాలా ఇష్టం. కేన్సర్ చికిత్స కోసం ఎదురుచూస్తున్న పిల్లలకోసం నిధులు సేకరిస్తుంటుంది. నోటి పరిశుభ్రతపై కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

World’s Deadliest Diseases | ప్రపంచాన్ని భయపెట్టిన 6 అతిపెద్ద మహమ్మారులు.. టెక్నాలజీ, వైద్యులు, పరిశోధనలు లేకున్నా ఎలా అంతమయ్యాయి ?

Inavolu Mallanna Jatara | తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే జాతర ఐనవోలు.. దీని విశిష్ఠత ఏంటి? అన్నిటికంటే ఈ జాతర ఎందుకు ప్రత్యేకం?

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News