Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowEider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల...

Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?

Eider polar duck | చిన్నప్పుడు నెమలి ఈకలు కనిపిస్తే ఏం చేసేవారో గుర్తుందా? పుస్తకాల్లోని పేజీల మధ్య దాచిపెట్టి ఎంతో అపురూపంగా చూసుకునేవారు. నెమలి ఈకలను అలా పుస్తకాల్లో పెట్టి ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా తీసుకుంటే అవి పిల్లలు చేస్తాయని సరదాగా చెప్పుకునేవాళ్లం. వీటి గురించి ఇప్పుడున్న పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు కానీ 2000 సంవత్సరానికి ముందు పాఠశాల విద్యనభ్యసించిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. స్కూళ్లలో నెమలి ఈకలను అపూరూపంగా దాచుకున్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. కానీ ఈ ఈకలు మాత్రం ఇంకాస్త అపురూపమైనవి. అంతకంటే అరుదైనవి.. ఖరీదైనవి కూడా. ఇంతకీ ఏం ఈకలు.. ఎందుకంత ఖరీదైనవో తెలియాలంటే ఓ లుక్కేయాల్సిందే..

ఐస్‌లాండ్‌లో ఈడర్ పోలార్‌ పేరుతో పిలిచే బాతులుంటాయి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఇక్కడ మాత్రమే నివసించే ఈ అరుదైన బాతుల ఈకలే అత్యంత ఖరీదైనవట. మార్కెట్లో 800 గ్రాముల ఈకల ధర దాదాపు రూ. 3.71 లక్షలు పలుకుతోంది.

ఎందుకింత ధర?

ఈకలకు 3.71 లక్షల రూపాయలా అనుకోవద్దు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఫైబర్‌ ఈ బాతు ఈకల్లోనే ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇవి అత్యంత తేలికగా ఉంటాయి. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయట. ఈ బాతు ఈకలతో లగ్జరీ బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులను తయారు చేసి భారీ ధరకు అమ్ముతుంటారు. అందుకే ఈ ఈకల కోసం లగ్జరీ ఉత్పత్తుల సంస్థలు పోటీపడుతుంటాయి. ఫలితంగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలో మరెక్కడా ఈ బాతులు, వాటి ఈకలు దొరకవు కాబట్టి ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేసేందుకు లగ్జరీ ఉత్పత్తుల సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీంతో స్థానికంగా ఇది ఉపాధిగా మారిపోయింది.

కిలో ఈకలకు 60 బాతులు కావాలి

సాధారణంగా ఒక కిలో ఈకలు సేకరించాలంటే 60 బాతులు అవసరమవుతాయట. అందుకే స్థానికులు ఈ బాతులు కనిపించినా ఎలాంటి హాని తలపెట్టరు. ఈడర్‌ పోలార్‌ బాతులు.. గుడ్లు పెట్టి పొదిగే సమయంలో వీటి ఈకలన్నీ ఊడిపోతాయట. ఇలా ఒక్కో బాతు ఏడాదికి మూడు సార్లు ఈకలను వదిలేస్తుంది. ఆ సమయంలోనే ఈకలను సేకరిస్తారు స్థానికులు. భారీ ధర పలుకుతుండటంతో స్థానికులకు ఇది పెద్ద ఉపాదిగా మారిపోయింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News