Home Latest News Viral News | లంచం ఇయ్యలేను సారూ.. ఈ ఎద్దును ఉంచుకొని పనిచేసి పెట్టండి

Viral News | లంచం ఇయ్యలేను సారూ.. ఈ ఎద్దును ఉంచుకొని పనిచేసి పెట్టండి

Viral News | లంచం అడగడం నేరం.. లంచం తీసుకున్న వారికి శిక్షలు పడుతున్నప్పటికీ కూడా లంచగొండి అధికారుల బాగోతాలు ఎక్కడో చోట బయటపడుతూనే ఉంటున్నాయి. లంచం ఇచ్చుకోలేని బాధితులు తమ గోడును ఉన్నతాధికారుల ముందు ఎన్నిసార్లు వెల్లబోసుకున్నప్పటికీ కూడా ఇంకా కొందరి తీరు మాత్రం మారనట్లే ఉంటున్నారు. తాజాగా ఓ అధికారి లంచం కావాలని వేధించడంతో ఏం చేయాలో పాలుపోని ఓ బాధితుడు తన వద్ద ఉన్న ఎద్దును తీసుకోమని ఆఫీసుకే తీసుకొచ్చాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లు ఫొటోలు, వీడియోలు తీయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సొంత జిల్లా హవేరీలోనే ఈ లంచగొండి బాగోతం బయటపడింది.

హవేరీ మున్సిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజీ అనే రైతు.. మున్సిపల్ రికార్డుల్లో పలు సవరణల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తులో అన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ సదరు సెక్షన్ ఆఫీసర్ పని చేయలేదు. ఇదేందని అడిగితే లంచం కావాలని అడిగాడు. చేసేదేమీ లేక ఆ అధికారికి కొంత లంచం ఇచ్చాడు. ఈలోపే ఆ అధికారి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. బదిలీ అయ్యేలోపు ఎల్లప్ప దరఖాస్తును మాత్రం అతను ప్రాసెస్ చేయలేదు. దీంతో కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం అడగడంతో కథ మొదటికొచ్చింది.

ఇంతకుముందు ఉన్న అధికారికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చానని.. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని ఎల్లప్ప చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు ఉన్న అధికారికి లంచం కింద ఉన్నదంతా ఇవ్వాల్సి వచ్చిందని.. కనికరించమని కొత్త అధికారికి మొరపెట్టుకున్నాడు. కానీ అతను మాత్రం పట్టించుకోలేదు. డబ్బులిస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు. అంతేకాదు బదిలీ అయిన అధికారికి ఇచ్చిన దానికంటే ఎక్కువ కావాలని డిమాండ్ చేశాడు. ఏం చేయాలో అర్థం కానీ ఎల్లప్ప.. తన దగ్గర ఉన్న ఎద్దుల్లో ఒకదాన్ని కార్యాలయానికి తీసుకొచ్చాడు. లంచం బదులు ఆ ఎద్దును ఉంచుకోవాలని అధికారికి ఇచ్చాడు. లంచం కింద ఆ ఎద్దును ఉంచుకుని తన పని చేసి పెట్టాలని ప్రాధేయపడ్డాడు. ఇలా కార్యాలయానికి రైతు ఎద్దుతో రావడంతో మొదట అందరూ షాకయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని లంచగొండి అధికారిపై దుమ్మెత్తి పోశారు. ఈ విషయం కాస్త వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సదరు అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎల్లప్ప పని చేసి పెడతామని హామీ ఇచ్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Exit mobile version